Vishweshwar Reddy On KCR: మరికొంత మంది బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీయే గెలుస్తుందని సర్వేలో తేలినట్లు తెలిపారు. కావాలనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. రిటైర్ మెంట్  అయిన బీజేపీ నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి మరీ పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తెగించి కొట్లాడే నేతలెవరు టీఆర్ఎస్ లో చేరరని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్  మాజీ ఎంపీలు ముగ్గురు, మంత్రులు ఇద్దరు, మంత్రి అల్లుడు ఒకరు త్వరలోనే బీజేపీలో చేరుతారన్నది ఫోన్ టాపింగ్ లతో తెలుసుకుని కెసీఆర్ వారిపై నిఘా పెట్టారని చెప్పారు. నయానో భయానో ఇచ్చి వారిని పార్టీ మారకుండ చేసే పనిలో ఉన్నారన్నారు.


నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన బండి సంజయ్ 


తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు సహా ఇచ్చిన హామీలన్నీ విస్మరించిన టీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అట్లా చేస్తే కేసీఆర్‌ నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అంటూ దుయ్యబట్టారు. గొల్ల కురుమలకు గొర్రెల పైసలు రాకుండా ఫ్రీజ్ చేయాలంటూ తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని కేసీఆర్‌ను నిలదీశారు. దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భార్యాపిల్లలతో కలిసి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 


ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని... ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. బతికుండగానే మన సమాధి కట్టి, ఫొటో పెడితే కుటుంబ సభ్యులు బాధపడతారా? లేదా?... మరి టీఆర్ఎస్ వాళ్లను ఏమనాలె? నిజాయితీకి నిలువుటద్దంగా మారిన జేపీ నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ నేతలను ఏం చేయాలే? కేసీఆర్ ను ఏం చేయాలే అంటూ తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్.
 
రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. ఈరోజు ఎవరైతే సమాధి పేరుతో అవహేళన చేశారో... వారి బట్టలూడదీసి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయ్ అని హెచ్చరించారు బండి సంజయ్‌ కార్యకర్తలను కంట్రోల్ చేయడం చేతగాకుంటే మూసుకుని ఉండమన్నారు. తాను ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదన్నారు. బతికున్న వ్యక్తికి సమాధి కడతారా? తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యే లేదని చెప్పిన కేసీఆర్...  మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారమైందని చెప్పి.... ఫ్లోరోసిస్ సమస్య పై జేపీ నడ్డా పేరుతో సమాధి ఎట్లా కట్టినవ్ అని నిలదీశారు.