ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (FIPRESCI) ఇండియా చాప్టర్ ఒక పోల్ ను కండక్ట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ ఫిలిమ్స్ పై పోల్ నిర్వహించి.. టాప్ 10లో ఉన్న సినిమాలేవో వెల్లడించింది. ఈ లిస్ట్ లో సత్యజిత్ రే రూపొందించిన 'పథేర్ పాంచాలి'(Pather Panchali ) అనే సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. 1929లో ప్రచురించిన బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాతోనే 1955లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు సత్యజిత్ రే. ఈ సినిమాను సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ లో రూపొందించారు. ఈ సినిమాకి క్రిస్టోఫర్ నోలన్, మార్టిన్ స్కోర్సెస్, వెస్ ఆండర్సన్ వంటి ఫ్యాన్స్ ఉన్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో హ్యుమానిటీ, పోవెర్టీ వంటి అంశాలను చూపించారు. ఒక ఫ్యామిలీ ఎదుర్కొన్న పరిస్థితులను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో చూపించారు.
ఈ సినిమా తరువాత 1960లో విడుదలైన 'మేఘే దాకా తార' అనే సినిమా రెండో స్థానాల్లో నిలిచింది. రిత్విక్ ఘటక్ ఈ సినిమాను రూపొందించారు. మూడో స్థానంలో మృణాల్ సేన్ తెరకెక్కించిన 'భువన్ షోమ్' అనే సినిమా నిలిచింది. 1969లో ఇది రిలీజయింది. ఆ తరువాత స్థానాల్లో అదూర్ గోపాలకృష్ణన్ రూపొందించిన మలయాళ సినిమా 'ఎలిప్పతయం', గిరీష్ కాసరవల్లి తెరకెక్కించిన 'ఘటశ్రాద్ధ' వంటి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ సినిమా 'షోలే' టాప్ 10 ప్లేస్ దక్కించుకుంది.