Mallareddy IT Raids  :  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లల్లో సాగుతున్న ఐటీ సోదాల కారణంగా  ఆయన బంధువులు అస్వస్థకు గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవడం వల్ల ఛాతి నొప్పి సమస్యలతో ఆస్పత్రికి వెళ్తున్నారు.   మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి తెల్లవారు జామున ఛాతిలో నొప్పిగా ఉండటంత వెంటనే ఆస్పత్రికి తరలించారు. సూరారంలోని నారాయణ - మల్లారెడ్డి ఆస్పత్రికే తరలించారు.   దీంతో, తన కొడుకును చూసేందుకు మల్లారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వచ్చారు.  ఐటీ అధికారుల తీరును నిరసిస్తూ ఆయన ఆసుపత్రి ముందు బైఠాయించారు. తర్వాత ఇంటికి వెళ్లారు. 


కుమారుడితో పాటు మల్లారెడ్డి మరదలి కుమారుడికీ అస్వస్థత


అలాగే ఆయన మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయన కూడా తనకు ఛాతిలో నొప్పి అని చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు.  అటు మహేందర్ రెడ్డికి.. ఇటు ప్రవీణ్ రెడ్డికి ఆరోగ్యం నిలకడగా ఉందని.. భుజం వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతోనే ఆస్పత్రికి తరలించినట్లుగా ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ వారితో పాటు ఐటీ అధికారులు ఉంటున్నారు. మల్లారెడ్డి ఇంట్లో సోదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. ఈ కారమంగా ఆయన ఆస్పత్రి నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నారు.  


ఐటీ అధికారుల వేధింపులవల్లేనని మల్లారెడ్డి ఆరోపమ
  
ఐటీ అధికారులు వేధిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. తన కుమారుడ్ని ఛాతిపై కొట్టడం ద్వారానే ఆయనకు అస్వస్థత వచ్చిందని అంటున్నారు. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన అన్ని వ్యాపార సంస్థలు, వాటి నిర్వహణ చూస్తున్న వారందరి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. దాదాపుగా రెండు వందల మంది .. రేయింబువళ్లూ పత్రాలు పరిశీలిస్తున్నారు. కీలకమైన విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేర వేస్తూ.. సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు మెడికల్ కాలేజీలు, 36  ఇంజినీరింగ్ కాలేజీలు,  నాలుగు ఇంటర్నేషనల్ స్కూల్స్‌తోపాటు వందల ఎకరాల భూముల పత్రాలు లభించడంతో వాటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. 


మల్లారెడ్డి ఇంటి సోదాల్లో దొరికిన నగదు ఎంత అనేదానిపై సస్పెన్స్ 


ఈ రైడ్స్ లో భాగంగా మల్లారెడ్డి బంధువుల ఇంట్లో ఎంత దొరికిందన్న దానిపై స్పష్టత లేదు. వివరాలను ఐటీ అధికారులు బయటకు రానీయడం లేదు.  బ్యాంకులకు సంబంధించి లావాదేవీల్లో వ్యత్యాసాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం 300 బ్యాంకు అకౌంట్లకు సంబంధించి లావాదేవాలను పరిశిలీస్తున్నారు. మరో రెండు రోజుల పాటు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి బంధువుల్లో పలువురు అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది.  అయితే వైద్యులు మాత్రం ఒత్తిడికి గురి కావడం. .. హైపర్ టెన్షన్ వల్లే  అలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. 


మరోసారి మోదీతో సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం - డిసెంబర్ 5న ఢిల్లీలో ఏం జరగనుంది?