మీట్ డెలివరీ యాప్ 'లీషియస్' (Licious) కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక యాడ్ చేశారు. తమ సంస్థకు ఆయన ప్రచారం చేస్తున్నారని, కమర్షియల్ యాడ్ కోసం షూటింగ్ చేశారని 'లీషియస్' ముందే హింట్ ఇచ్చింది. ఈ రోజు ఆ యాడ్ వీడియో విడుదల చేశారు.
చేప చిన్నదే అయినా...
ఎర పెద్దగా వేయాలి!
ఎన్టీఆర్‌తో పాటు నటుడు రాహుల్ రామకృష్ణ కూడా యాడ్‌లో కనిపించారు. బోనులో యంగ్ టైగర్... ఆయనకు ఏదో డైలాగ్ వివరిస్తున్నట్లుగా, సహాయ దర్శకుడి తరహాలో డైలాగ్ పేపర్ పట్టుకున్న రాహుల్ రామకృష్ణ... యాడ్ కొంచెం కొత్తగా డిజైన్ చేశారు.
'ఇంపాజిబుల్ యువరానర్... ఇంపాజిబుల్ యువరానర్' అని ఎన్టీఆర్ అంటుంటే... 'ఆరు పేజీల డైలాగ్ అయినా సరే అర సెకన్‌లో చెబుతారు. మీకు ఇంత చిన్న డైలాగ్...' అని రాహుల్ రామకృష్ణ అడిగితే... 'చిన్న చేప అయినా ఎర పెద్దది వేయాలి' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బావుంది. సింగిల్ చెప అయినా సరే సేమ్ ప్రాసెస్ అంటూ లీషియస్ గురించి ఆయన వివరించారు.
'డైలాగ్ చిన్నదే అయినా డైలెక్ట్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ యాడ్ మొత్తం మీద హైలైట్.
ఇప్పుడు మీట్ కొనడానికి షాప్స్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్... మీకు కావల్సినది ఏదైనా ఇంటికి డెలివరీ చేయడానికి ఆన్‌లైన్ యాప్స్ వచ్చాయి. అందులో 'లీషియస్' (Licious) ఒకటి.
వసూళ్ళతో పాటు స్టార్స్ చేస్తున్న యాడ్స్‌ను బట్టి స్టార్‌డమ్ అంచనా వేస్తున్న రోజులు ఇవి. ఆడియన్స్‌లో, పబ్లిక్ మార్కెట్‌లో స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి యాడ్స్ ఉపయోగపడుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ మాటకు వస్తే... జపాన్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'లో నటనతో పాటు జపనీస్ స్పీచ్‌తో అక్కడి ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు.
Also Read : హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య - ఆయన్నుంచి ఆ ఒక్కటీ నేర్చుకోవాలి బాస్!
ఫుడ్ యాడ్స్ ఎక్కువ చేస్తున్న ఎన్టీఆర్?
ఇంతకు ముందు Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే యాప్ కోసం యాడ్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఎక్కువ ఫుడ్ యాడ్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే... ఎన్టీఆర్ ఫుడ్డీ. ఆయన వంట బాగా చేస్తారని ఫ్రెండ్స్ కొందరు చెబుతూ ఉంటారు. ఇంతకు ముందు నవరత్న ఆయిల్ కోసం కూడా ఆయన ఒక యాడ్ చేశారు. జొమోటో కోసం అల్లు అర్జున్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే.
సినిమాలకు వస్తే... త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా (NTR 30) షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దాన్ని చిత్ర బృందం ఖండించింది. ప్రస్తుతం కొరటాల శివ ఫుల్ స్వింగులో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు.