TRS MLA A Jeevan Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ఊసరవెల్లి అని, దాన్ని మించి రంగులు మార్చిన వ్యక్తి అని కాంగ్రెస్ కీలక నేతపై పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీఆరెస్ అధ్యక్షుడు ఏ. జీవన్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణ గాంధీ కేసీఆర్ పుట్టిన రోజును యావత్ తెలంగాణ ప్రజలతో పాటు కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ఇండ్లలో కూడా కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ అంతటా పండగ వాతావరణం ఉంటే ఊసరవెల్లి వంశోద్ధారకుడు రేవంత్ రెడ్డి నీచంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.


టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (TRS MLA Jeevan Reddy) ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఊసరరవెల్లి కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతుంది. ఊసరవెల్లిని మించి రంగులు మార్చి పార్టీలు మారిన నేత రేవంత్ కూడా ఆ రంగులు మార్చే జీవి గురించి మాట్లాడుతున్నారు. రంగులు వేసే పెయింటర్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం రంగులు మార్చే నేతగా అవతారమెత్తాడు. కేసీఆర్ బర్త్‌డేను నిరుద్యోగ దినంగా పాటించాలని ఓ సన్నాసి పిలుపు నిచ్చాడు. రేవంత్ బర్త్ డే నవంబర్ 8న నేరస్థుల దినంగా పాటించాలని నేను పిలుపు నిస్తున్నా.


దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల్లాగ తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే రాష్ట్ర ప్రజలకు పండగ రోజు. కేసీఆర్ బర్త్ డే (Telangana CM KCR)ను రాష్ట్ర పండగగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా. ఆయనకు వంద శాతం గౌరవం ఇవ్వాల్సిందే. సీఎం కేసీఆర్‌ను సంస్కార హీనంగా తిడితే ఎవరి నైనా జైలుకు పంపాల్సిందే. పాలక, ప్రతిపక్షాల నేతలు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. కానీ కేసీఆర్ బర్త్‌డేను దేశ వ్యాప్తంగా జరుపుకుంటే ఓర్చుకోలేక పోతున్న కుసంస్కారి రేవంత్ రెడ్డి.


రేవంత్ కు పిచ్చి ముదిరింది.. పీసీసీని పిచ్చి కాంగ్రెస్ కమిటీగా మార్చారు. రేవంత్ రెడ్డి ఓ సైకో, శాడిస్టులా మారిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు అలాంటి వ్యక్తి అయిన రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. గాంధీ భవన్ ను బ్రాందీ భవన్‌గా మార్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినా బుద్ది మారడం లేదు. అందుకే కాంగ్రెస్ సీనియర్లు కూడా రేవంత్ వైఖరిని తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేదు.. రేవంత్‌కు క్యారక్టర్ లేదు. పాము తన పిల్లలను తాను తిన్నట్టు రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మింగేస్తాడని’ టీఆర్ఎస్ నేత ఏ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Also Read: KCR Medaram : కేసీఆర్ మేడారం ఎందుకు వెళ్లలేదు ?