Telangana Bill Passed Date: సరిగ్గా 8 ఏళ్ల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 18న) లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రం విడిపోతే మీకు పాలన చేతకాదు, ఇన్నాళ్లు మిమ్మల్ని మేము సాకినం అని అనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన నేతలు మనల్ని అవమానించారు. కానీ ఈరోజు ఏం జరిగింది. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు ఇది నిదర్శనం అన్నారు.


సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేతల సమావేశం (KTR addressing party cadre in Rajanna Sircilla)లో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మీకు విద్యుత్ కేంద్రం ఉండదు, మీరు అవి కోల్పోతారు, ఇవి కోల్పోతారు అని బెదిరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవని, ప్రస్తుతం కేసీఆర్ పాలనలో అలాంటి పరిస్థితి లేదన్నారు. నేడు తెలంగాణ పుట్టుకనే సవాల్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇక్కడ పుట్టు గతులు ఉండవన్నారు. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న నీతి ఆయోగ్ అధికారులు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని రాత పూర్వకంగా సిఫార్సు చేసింది.


ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు అన్నారు ఏమైంది అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తే.. మీరు సిరిసిల్ల(Rajanna Sircilla)కు వెళ్లండి, హాస్పిటల్ ముందట బజ్జీలు, పకోడిలు వేసుకుంటున్నారు. ఇవి ఉద్యోగాలే వీళ్లు మీకు కనిపిస్తలేరా అని మోదీ చెబుతున్నారు. మోదీ చెప్పిన 16 కోట్ల ఉద్యోగాలు ఇవే. గ్రామాల్లో ఎవరైనా అడిగితే నమో గురించి చెప్పాలి. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు. ఇది తెలియక 2014లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. మీరు గుజరాత్‌లో నిజంగా ఏదైనా డెవలప్ చేసి ఉంటే, దేశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారని ప్రధాని మోదీని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.


దళితుల కోసం, రైతుల కోసం మీరు ఏం చేశారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నిస్తే.. అక్బర్ అంటారు, బిన్ లాడెన్ అని చెప్పడం తప్ప ఏం లాభం లేదన్నారు. మొన్న కరీంనగర్‌లో గెలిచిన బండి సంజయ్ కుమార్ ఏం చేశారు. మోదీ పెద్ద నేత అని గొప్పలు చెబుతారు, కానీ ఈ మూడేళ్లలో కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారో చెప్పాలని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. టెక్స్ టైల్ కోసం కేంద్ర మంత్రులను నిరంతరం కలిసి అప్లికేషన్ ఇస్తున్నాం కానీ ఏ సదుపాయాలు, పార్క్ లు ఏర్పాటు చేయలేదన్నారు. 


కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో కట్టుకున్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తారు, మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు. మీరు కేవలం ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాలకే మీరు ప్రధానిగా ఉన్నారా, తెలంగాణకు ఇంకో ప్రధాని ఉన్నారా అని ఎద్దేవా చేశారు. కరోనా వ్యాప్తి సమయంలోనూ దేశంలోని పలు రాష్ట్రాల్లో భక్తులు మేడారం జాతరకు వస్తారు. అలాంటి జాతరకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వగా, ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు రూ.300కు పైగా కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇది మనీ కుంభమేళా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం చెబుతారు, కానీ తెలంగాణలో యూపీ కుంభమేళాకు ఇచ్చిన దాంట్లో సగం కాదు కదా ఒక్క శాతం మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


16 ట్రిపుల్ ఐటీలు కేంద్రం ఇస్తే, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మనకు తీసుకొచ్చింది గుండు సున్నా, దేశం మొత్తంలో 87 నవోదయ స్కూల్స్ ఇస్తే, తెలంగాణకు ఇచ్చింది శూన్యం. బీజేపీ అంటే బక్వాస్ జాతీయ పార్టీ అన్నారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటారు, వేములవాడ రాజన్నకు తెలంగాణ ఎంతో చేసింది, బండి సంజయ్‌కు దమ్ముంటే వంద కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. గత 8 ఏళ్లుగా బీజేపీ వేధింపులను ప్రజలకు తెలిసేలా చేసి, అంతా కలిసి పోరాటం చేసేందుకు సిద్ధం చేద్దామన్నారు.


Also Read: Chinajeeyar : కేసీఆర్‌తో ఎలాంటి వివాదాల్లేవు - మీడియా వల్లే దూరం పెరిగిందని పరోక్షంగా చెప్పిన చినజీయర్ !


Also Read: Assam CM Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై మహిళా కమిషన్‌కు రేణుకా చౌదరి, గీతా రెడ్డి ఫిర్యాదు