Revanth Reddy: హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, అమెరికాలో ఒప్పందం - 1000 మందికి ఉద్యోగాలు

Revanth Reddy US Tour | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

AI innovation center in Hyderabad | హైదరాబాద్: ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ సెంటర్ పై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 1,000 మందికి పైగా  ఉద్యోగులను నియమించుకొని శిక్షణను ఇవ్వనుంది.

Continues below advertisement

సీఎం రేవంత్ రెడ్డి టీంతో ట్రైజిన్ ప్రతినిధులు చర్చలు

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ అమెరికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ట్రైజిన్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రతినిధులతో భేటీలో తమ నిర్ణయం ప్రకటించింది. వచ్చే మూడేండ్ల కాలంలో దాదాపు 1,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉందని సమచారం. ప్రపంచ వ్యాప్తంగా ట్రైజిన్ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది భారత్ లో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌ (Hyderabad City)లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో 6 నెలల్లోనే ట్రైజిన్ కంపెనీ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.  

రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 2023 నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో  అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ (Artificial intelligence) వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తుంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని ఈ కంపెనీ పనిచేస్తుందిన ప్రతినిధులు తెలిపారు. 

Also Read: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, అమెరికాలో సీఎం రేవంత్ ఒప్పందం - 15000 మందికి ఉద్యోగాలు

Continues below advertisement