Trains Additional Stops In Telangana: తెలంగాణలో (Telangana) ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపులు కల్పించింది. తన విజ్ఞప్తి మేరకు ఈ స్టాపులు ఇచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సికింద్రాబాద్ (Secunderabad), హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే పలు రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలు వచ్చాయని.. అందులో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
☛ కాజీపేట - బల్లార్ష ఎక్స్ ప్రెస్ రాఘవాపురంలో, బల్లార్ష - కాజీపేట ఎక్స్ ప్రెస్ మందమర్రిలో ఆగుతాయి.
☛ పుణె - కాజీపేట ఎక్స్ ప్రెస్ మంచిర్యాల, దౌండ్ - నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ నవీపేట, తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ మేడ్చల్ లో స్టాపులు కల్పించారు.
☛ భద్రాచలం రోడ్ - బల్లార్ష సింగరేణి మెమొ ఎక్స్ ప్రెస్ బేతంపూడిలో, నర్సాపూర్ - నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ మహబూబాబాద్ లో ఆగుతాయి.
☛ సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇక నుంచి మిర్యాలగూడలోనూ ఆగుతుంది.
☛ అలాగే, సికింద్రాబాద్ - భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్ ప్రెస్ తడికలపూడిలో, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రామన్నపేటలో ఆగుతాయి.
☛ గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ ఉందానగర్ లో, కాజీపేట - బల్లార్ష రేచ్ని రోడ్ లో, తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ ప్రెస్ నెక్కొండలో, భద్రాచలం రోడ్ - సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ బేతంపూడి స్టేషన్లలో ఆగనున్నాయి.
మరో 2 వందేభారత్ రైళ్లు
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ (Vande Bharat) రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 12న కొత్తగా 10 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనుండగా.. 2 రైళ్లు ఏపీ, తెలంగాణలో నడపనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ (Secunderabad) - విశాఖకు (Visakha) ఓ వందేభారత్ ట్రైన్ నడుస్తుండగా.. రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఈ రూట్ లో మరో వందేభారత్ రైలును కేటాయించారు. అలాగే, విశాఖ - భువనేశ్వర్ కు వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. భువనేశ్వర్ నుంచి హౌరాకు ఓ రైలు తిరుగుతుండగా, మరో అదనపు రైలును విశాఖ - భువనేశ్వర్ రూట్ లో కేటాయించారు. ఇంకా ఇతర రూట్లలో మరో 8 రైళ్లను ప్రారంభం కానున్నాయి.
Also Read: Telangana News: ఈ నెల 11న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితా, లిస్ట్‌లో తెలంగాణ నేతలు కూడా!