హుజూరాబాద్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, తదితర నేతలు ప్రారంభించారు. నగర, బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు నిర్వహిస్తున్న డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపారు.


నాయకులు ఎంత మంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని.. మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనది క్రమశిక్షణ అని.. తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు అన్నారు. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాన్నారు. అలాంటి కార్యకర్తలకు పార్టీ పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటానన్నారు. పార్టీ కోసం విశేషంగా పనిచేసే కార్యకర్తలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని చెప్పారు.


Also Read: పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు, అసలు ఏంటి ఈ వ్యవహారం?


బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలే
తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలే. రైతులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాత్రం రైతుల పక్షాన ఉంటుంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌస్‌లో బందీ ఐనది. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్లు చచ్చిన వాళ్లతో సమానం. కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తాను. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నాం. కష్టపడని పార్టీ కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు.
Also Read: పేరు విలియమ్స్ .. చేయాల్సింది పియానో వాయించడం.. చేసింది అమ్మాయిలకు టోకరా ! ఈ మోసగాడి కథ మామూలుగా లేదు.. !


కొంపల్లిలోని ఆస్పైసియాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విచ్చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడీ , ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజులు మాణికం ఠాగూర్‌కు ఘన స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పార్టీ వ్యూహాలపై చర్చించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి