TPCC Chief Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయగా.. ఫస్టియర్‌లో 63,32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కానీ, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుండగా, ఫెయిల్ కావడంతో ఇంట్లో అమ్మానాన్నలు ఏమంటారోనన్న భయంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 


తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి డిమాండ్..
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడులయ్యాక తలెత్తుతున్న పరిస్థితులు చూస్తే తన గుండె తరుక్కుపోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తక్కువ మార్కులు వచ్చాయని కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారని, ఫెయిల్ కావడంతో మరికొందరు చిన్నారులు ఆత్మహత్యలు చేసుకోవడంపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల భవితవ్యం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇంటర్ రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు గానూ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోను సైతం ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు.






ఫస్టియర్‌లో 63,32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం పాస్ 
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాలలో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు ( ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి ). ఇంటర్ సెకండియర్‌లో  67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్  72.30 శాతం, అబ్బాయిలు 1,25,686 మంది 54.20 శాతం పాస్ అయ్యారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు రావడంతో ఇంటర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేశామన్నారు. ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


Also Read: TS Inter Supplementary Exams Date: ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ వద్దు, ఇలా చేస్తే సరి !