సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో దళిత బంధు ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ అంబేద్కర్- జగ్జీవన్ జయంతి- వర్ధంతి నిర్వహించలేదన్నారు. నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విధంగా అంబేద్కర్ విగ్రహం పెడుతానని చెప్పిన విషయం ఏమైందని ప్రశ్నించారు.
Also Read: Bandi Sanjay: దళిత బంధు ప్రారంభించడం కంటే ముందు బండి సంజయ్ ప్రెస్ మీట్.. ఏం అడిగారో తెలుసా?
ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
- మూడెకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతా అని మాట తప్పారు. దళితుల అభివృద్ధి కోసం ఒక్క సమీక్ష కూడా ముఖ్యమంత్రి చెయ్యలేదు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్- లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు.
- ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిని థర్డ్ డిగ్రీ-మరియమ్మ ను చంపిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
దళిత బంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారు. అబద్ధాల పునాదుల మీద బీటలు పారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. - అంబేద్కర్ పేరుమీద పెట్టిన ప్రాణహిత చేవెళ్ల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడారా? ప్రాణహిత చేవెళ్ల లోపాల గురించి- ప్రాజెక్టు రిడిజైన్ గురించి కేసీఆర్ ఉద్యమంలో ఏనాడైనా ఉద్యమంలో ప్రశ్నించారా?
తెలంగాణ ఉద్యమంలో మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ గురించి ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలోని చాలా గూడాల్లో నీళ్లపైపు కనెక్షన్స్ ఇంకా రాలేదు. - మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్ ది. చెరువుల్లో మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు సంపాదించారు. మిషన్ కాకతీయ పై నిజనిర్ధారణ కమిటీ వెయ్యాలి.
- కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ప్రజల కోసం కాదు- ప్రజాధనం దోచుకోవడానికి. ఏడేళ్ల కాలంలో దళితులకు-గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదు. ఒక్క సీటు గెలవడానికి కేసీఆర్ నిచానికి దిగజారారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత- గిరిజనులు విద్యకు దూరం అయ్యారు. ఉద్యోగాలు టైమ్ కు ఇస్తే ఏడేళ్లలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు దళిత, గిరిజనులకు వచ్చేవి.
- దళితబంధుపై శాసనసభలో ఒకరోజు చర్చ జరిపి.. తీర్మానం చెయ్యాలి. ఆరు నెలల లోపు ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటే మేం ఎక్కడైనా సంతకాలు పెడుతాం.
- హుజురాబాద్ లో తుపాన్ రాబోతోంది- ఆ తుపాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారు. రాజకీయంగా కేసీఆర్ దళిత బంధు సభనే చివరి ఉపన్యాసం.