ప్రస్తుతం బీజేపీలో ఉన్నా - కేసీఆర్‌ను ఓడించే లక్ష్యం కోసం నిర్ణయాలు - రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరానని.. ఆ లక్ష్యం సాదించడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. హైకమాండ్ పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకే ఢిల్లీ వెళ్తున్నామన్నారు. కేసీఆర్ ను గద్దె దించే లక్ష్యంతో . తాను బీజేపీ పార్టీలో చేరాన్నారు. ఆ లక్ష్యం సాధించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు . తాను ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నానని.. బీజేపీ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. పూర్తి వివరాలు
తర్వాతేంటో తెలియదు - టీడీపీతో పొత్తుపై సోము వీర్రాజు విచిత్ర స్పందన !
తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటంది. ఎక్కడుకు వెళ్లినా ఏపీ బీజేపీ నేతలకు ఈ ప్రశ్న మాత్రం మీడియా నుంచి వస్తుంది. కానీ వారికి కూడా సమాధానం తెలియదు. చంద్రబాబు మా పార్టీ పెద్దలను కలిశారు... ఏపీకి అమిత్ షా, నడ్డా వచ్చి వైసీపీని విమర్శించారు...మేమూ వైసీపీ ఒకటి కాదని చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు. తర్వాత ఏంటనేది మనం ఆలోచించుకుంటున్నామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు చేశారని.. మరి చర్యలెప్పుడు తీసుకుంటారని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్న అంశంపై ఇటీవల సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాలు
వారాహి యాత్రకు వర్షం ఎఫెక్ట్ - మలికిపురం సభ వాయిదా !
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కు వర్షం అడ్డంకిగా మారింది. డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నేడు జరగనున్న వారాహి సభ వాయిదా వేసినట్లుగా జనసేన ప్రకటించింది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. రేపటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి.. హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదాలతో వారాహియాత్రను పవన్ కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఫీల్డ్ విజిట్ తో పాటు వివిధ వర్గాల వారితో సమావేశం అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అన్ని వర్గాలతో మమేకం అవుతూ యాత్ర సాగిస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. పూర్తి వివరాలు
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు- అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ఆయన్ని అధినాయకత్వం ఉన్నఫళంగా ఢిల్లీ రావాలని పిలుపునిచ్చింది. దీంతో షెడ్యుల్డ్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే అక్కడ ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఉండనే ఉన్నారు. దీంతో బీజేపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లెక్క మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 2023లో అధికారం మాదే అంటూ ప్రచారం చేసిన బీజేపీ లీడర్లు కర్ణాటక ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. అదే టైంలో కాంగ్రెస్ స్పీడ్ అందుకుంది. పూర్తి వివరాలు
వివాదాల్లోకి లాగొద్దంటూనే అనిల్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్- లోకేష్, ఆనంపై ఘాటు విమర్శలు