Somu Verraju :   తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటంది. ఎక్కడుకు వెళ్లినా ఏపీ బీజేపీ నేతలకు ఈ ప్రశ్న మాత్రం మీడియా నుంచి వస్తుంది. కానీ వారికి కూడా సమాధానం తెలియదు.  చంద్రబాబు మా పార్టీ పెద్దలను కలిశారు... ఏపీకి అమిత్ షా, నడ్డా వచ్చి వైసీపీని విమర్శించారు...మేమూ వైసీపీ ఒకటి కాదని చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు.  తర్వాత ఏంటనేది మనం ఆలోచించుకుంటున్నామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  జగన్ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు చేశారని..  మరి చర్యలెప్పుడు తీసుకుంటారని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్న అంశంపై ఇటీవల సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. 


చంద్రబాబు, అచ్చెన్నపై తన వ్యాఖ్యలను విమర్శలుగానో.. వ్యతిరేకంగానో చూడొద్దన్న వీర్రాజు                                      


దీనిపైనా సోము వీర్రాజు స్పందించారు. వారు బీజేపీని ప్రశ్నిస్తూ.. అలా మాట్లాడినందువల్ల తాము స్పందించాల్సి వచ్చిందన్నారు. తన మాటలను వ్యతిరేకంగానో అనుకూలంగానో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లనే ఏపీకి నష్టం జరుగుతుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు ..  అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయితే  జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోము వీర్రాజుకు ఎందుకు కోపమని ప్రశ్నించారు. దీనిపై సోము వీర్రాజు.. తన వ్యాఖ్యలను వ్యతిరేకంగానో అనుకూలంగానో చూడవద్దంటున్నారు. 


వైసీపీకి తాము ఎప్పుడూ దగ్గరగా లేమన్న సోము వీర్రాజు                                 


వైసీపీతో తాము ఎప్పుడూ దగ్గరగా లేమని వీర్రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిపై అలుపెరగకుండా పోరాడుతున్నామన్నారు. తాము ఏదో ఓ పార్టీకి దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల కిందట చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. అయితే ఆ సమావేశంపై రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారంలేదు.  అసలు ఆ సమావేశం పొత్తుల గురించేనా అన్నది కూడా తెలియదు. అయితే ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన  బీజేపీ అగ్రనేతలు  నడ్డా, అమిత్ షా ఇద్దరూ వైసీపీని విమర్శించడంతో పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి. 


వైసీపీ అవినీతి పై చర్యల కోసం డిమాండ్ చేస్తున్న  టీడీపీ                


అయితే టీడీపీ చర్యల కోసం డిమాండ్ చేస్తోంది. అవినీతి జరిగిదంని చెప్పడం కాదని.. చర్యలు తీసుకోవాలని అంటోంది.ఈ అంశంపై తరచూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాట్లాడుతూండటంతో  బీజేపీ నేతలు కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వాటిపై సోము వీర్రాజు.. అవినుకూలమో.. వ్యతిరేకమో కాదని చెప్పడం ద్వారా.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 







Join Us on Telegram: https://t.me/abpdesamofficial