ఆల్‌ ఇండియా కోటా ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు


ఆల్‌ఇండియాకోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లోని ఆల్‌ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 3వ తేది సాయంత్రం 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్‌ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


నేటి నుంచే టీచర్ల బదిలీలు


తెలంగాణలో నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్‌ 5ను జారీ చేశారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరుగుతాయిని అందులో ఆమె స్పష్టం చేశారు. కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల(హెచ్‌ఎం) పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి మూడు రోజులే గడువు విధించారు. 


కొనసాగుతున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర 


జోడో యాత్రకు సంఘీభావంగా గణతంత్య్ర సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేడు కొనసాగునుంది. తమతమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలంతా ఈ యాత్రను ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 


హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా ప్రదర్శన 


నేటి నుంచి హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభం కానుంది. 500 రకాల కుక్కలు, 120 రకాల పిల్లులను ప్రదర్శించనున్నారు. 


హైదారాబాద్ లో లిటరేచర్ ఫెస్టివల్


నేటి నుంచి హైదారాబాద్ లో లిటరేచర్ ఫెస్టివల్ సెక్రటేరియట్ సమీపంలోని విద్యారణ్య స్కూల్లో ప్రారంభంకానుంది. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత్ దామోదర్ మౌజోతోపాటు రచయితలు, కళాకారులు, దర్శకులు ఈ కార్యక్రమాికి హాజరుకానున్నారు.