నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా


బీజేపీ జాతీయా ఆధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నేడు కరీంనగర్లో జరగనున్న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. మొదట జేపీ నడ్డా ఈ నెల 16న వస్తారని ప్రచారం జరిగినా..ఆ రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో బహిరంగ సభ షెడ్యూల్ ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజులు ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. నేడు జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని బండి సంజయ్ అన్నారు. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ బీజేపీకి అడ్డా అని నిరూపిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలను ప్రజల్లోకి పంపుతామని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలు, తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడం ఇలాంటి పరిణామాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. వీటన్నింటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా రావడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. నడ్డా ఏం మాట్లాడతారు, శ్రేణులకు ఏ రకమైన సందేశం ఇస్తారనే ఆసక్తి నెలకొంది. కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ సొంత నియోజకవర్గం కావడంతో సభను విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర శాఖా భారీగా జనసమీకరణ చేస్తోంది. 


గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం 


గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ రోజు జరగనుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలకు జీఆర్ఎంబీ లేఖలు రాసింది. ఎజెండాను కూడా నిర్ణయించారు. నేటి సమావేశంలో బోర్డు వార్షిక బడ్జెట్ , 200 కోట్ల రూపాయల చొప్పున చెల్లించాల్సిన సీడ్ మనీ గురించి చర్చించనున్నారు.