Telangana Assembly :  వరద నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని  వ‌ర‌ద నష్టంపై స‌రైన ఆధారాలు లేకుండా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అసెంబ్లలో మాట్లాడారు.  రాష్ట్రంలో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్పకాలిక చ‌ర్చ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ బాబు మాట్లాడారు. పంట నష్టం కోసమే రూ. 1500 కోట్లు విడుదల చేయాలని కానీ.. మంత్రి వర్గంలో ఐదు వందల కోట్లు మాత్రమే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్  వ‌ర‌ద న‌ష్టం అంచాన‌ను శ్రీధ‌ర్ బాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు.  వ‌ర‌ద న‌ష్టంపై గాలి మాట‌లు మాట్లాడొద్దు.. వ‌రి పంట‌లో రెండు రోజులు నీళ్లున్నా న‌ష్టం జ‌ర‌గ‌దని స్పష్టం చేశారు.               


సోయా, ప‌త్తి పంట‌లో నీళ్లుంటే న‌ష్టం జ‌రుగుతుంది. ఇదేది ఆలోచించ‌కుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారని శ్రీధర్ బాబుపైమమండిపడ్డారు. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కేసీఆర్ రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న చేయ‌గానే కాంగ్రెసోళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. హేతుబ‌ద్ధంగా, శాస్త్రీయంగా ఆధారాలు చూపించాలి. రైతులు అంద‌ర్నీ గ‌మ‌నిస్తున్నారన్నారు. అయితే తాము చెప్పేది పూర్తిగా వినాలని అధికారపక్షానికి సహనం ఉండాలన్నారు. అదే సమయంలో కేటీఆర్  రైతుల‌కు మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని చెప్పిన వారు మాకు నీతులు చెప్ప‌డం స‌రికాదు. రెండు సార్లు రుణ‌మాఫీ చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. రైతుబంధు ప్ర‌వేశ‌పెట్టి 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు.                 


తెలంగాణ‌లోని రైతాంగానికి మూడు గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు బాహాటంగా వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. గ‌తంలో 6 గంట‌ల క‌రెంట్ ఇచ్చి రైతుల‌ను చావ‌గొట్టాం.. అవ‌కాశం ఇస్తే మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తాం. 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని వారి అధ్య‌క్షుడు నిర్ద్వందంగా చెప్పారు. కెమెరాల ముందు చెప్పిండు. శ్రీధ‌ర్ బాబు మాకు నీతులు చెప్పే ముందు.. వారి పార్టీ విధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్. ఉచిత్ విద్యుత్ అంశంపై ప్రత్యేకంగా చర్చ పెడితే..  సిద్ధమని కాంగ్రె్స నేతలు స్పష్టం చేశారు. వరద నష్టంపై మాట్లాడకుండా..టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారని  కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.                              


అసలు ఉచిత విద్యుత్ ప్రారంభిచింది కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క తెలిపారు. చెక్ డ్యాముల విషయంలో శ్రీధర్ బాబు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో హరీష్ రావు ఖండించారు. తర్వాత మాట్లాడిన కేటీఆర్  రైతుబీమా తెలంగాణ‌లో త‌ప్ప మ‌రెక్క‌డా అమ‌లు చేయ‌డం లేదు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి. దుష్ర్ప‌చారం చేయ‌డం స‌రికాదు. పూర్తి ఆధారాల‌తో మాట్లాడే స‌త్తా ప్ర‌భుత్వానికి ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.