Shock To  BRS :   భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలకు చిక్కులు తప్పడంలేదు.  లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ పేరును తొలగించారు.  బీఆర్ఎస్‌కు  గుర్తింపు ఇవ్వలేదు.  లోక్‌సభ, రాజ్యసభలు టీఆర్ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్ఎస్ తరపున లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు.  బీఏసీకి నామాని ఆహ్వానిస్తూ లోక్‌సభ సచివాలయం సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చించేందుకు బేఏసీ సమావేశం ఉన్నట్లు లోకసభ సచివాలయం సమాచారం పంపించింది. బీఏసీ సమావేశ సమాచారంలో విషయం బయటపడింది. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం లోకసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. దీంతో  బీఏసీ మెంబర్ స్టేటస్ నుంచి.. ఇన్వైటీగా మార్చారు. జాబితాలో  పేరు లేకపోయినప్పటికీ ఆహ్వానితుల జాబితాలో అయితే బీఆర్ఎస్ ఉంది. 


పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని  ఆ పార్టీ ఎంపీలు కో  రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు డిసెంబర్ 23న ్ందించారు.   లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే కేశవరావుతోపాటు ఎంపీలు అందరూ వెళ్లి ఈ వినతి పత్రాలు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు చేసిన విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ వెంటనే స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్‌గా మార్చాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు.  ఎంపీల విజ్ఞప్తిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకిసమస్య వచ్చినట్లయింది.                                         
 
భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పేరు మారిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలోనూ పార్టీ పక్షం పేర్లు అధికారికంగా మారాయి.    భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం(బీఆర్ఎస్ ఎల్పీ)గా వ్యవహరిస్తున్నారు  పార్టీ పేరు మారిన క్రమంలో శాసనసభ, మండలి రికార్డుల్లోనూ పేరు మార్చాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత.. కౌన్సిల్ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు.పార్టీ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ విజ్ఞప్తికి అనుగుణంగా టీఆర్ఎస్ శాసనసభా పక్షం పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షంగా మారుస్తూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు మార్పునకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేశారు కానీ పార్లమెంట్‌లో మాత్రం వారికి చ్కిక్కలు ఎదురవుతున్నాయి.