Sajjanar Clarity On TGSRTC New Logo: తెలంగాణ ప్రభుత్వం TSRTCను TGSRTCగా మార్చింది. దీనిపై బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కొత్త లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు. కొత్త లోగో విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని.. ఇప్పటివరకూ అధికారికంగా కొత్త లోగోను సంస్థ రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుందని ఆయన తెలిపారు. ఎలాంటి లోగోను ఫైనల్ చేయలేదని.. వైరల్ అవుతున్న లోగో ఫేక్ అని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీని పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చామని.. అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలు @tgsrtcmdoffice, @tgsrtchqగా మార్చామని పేర్కొన్నారు. సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను కొత్త సోషల్ మీడియా ఖాతాలో ఇవ్వాలని అన్నారు. 






Also Read: Latest Telugu News: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు- ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురు మృతి