Krishna mukunda Murari  Serial Today Episode : మేం మళ్ళీ సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యామని కృష్ణ చెప్తుంది. వీళ్ళు ఇంకెవరితోనో బిడ్డని కంటే నా ఆటలు ఎలా సాగుతాయని మనసులో అనుకుంటుంది మీరా. ఎందుకు టెన్షన్ పడుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఏం లేదని మీరా అనగానే కృష్ణ లాగిపెట్టి చెంప పగలగొడుతుంది. నా బిడ్డని నీ కడుపులోనే ఉంచుకుని తీయించేశానని అబద్ధం చెప్తావా? ఎందుకు మాతో అబద్ధం చెప్పావు, బిడ్డని నీ కడుపులోనే పెట్టుకుని ఎందుకు నాటకాలు ఆడుతున్నావని మీరా జుట్టు పట్టుకుని అడుగుతుంది. 


కృష్ణ: నీ లాంటి దుష్టురాలి కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే నిజం కలిచి వేస్తున్నా పెరుగుతుంది నా బిడ్డ కాబట్టి వదిలేస్తున్నా.. ఎందుకు అబద్దం ఆడావు, ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్? అసలు ఎవరు నువ్వు? నా కుటుంబానికి నీకు ఏంటి సంబంధం.


మీరా: దాహంగా ఉంది వాటర్ తీసుకురా.. నాకోసం కాదు నా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసం. నీకు ఎవరి పేరు వింటే కోపం చిరాకు పుట్టుకు వస్తాయో, ఎవరిని చూస్తే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుందో ఆ ముకుందని నేనే.


కృష్ణ: ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నువ్వు ముకుంద ఏంటి?


మీరా: నిజం చెప్పమంటావ్ చెప్తే నమ్మవు. నేను మీరా కాదు ముకుంద. ముకుందలా ఉండి మురారిని గెలవలేనని అర్థం అయ్యింది. అందుకే చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా మీరాలా మారిపోయాను. అందుకే రూపం మార్చుకున్నాను.


అంటూ మీరా నిజం చెప్పేసరికి కృష్ణ షాక్‌ అవుతుంది. నువ్వు పిల్లల్ని కంటే మురారి నాకు దక్కడని నీ గర్భసంచిని పోగొట్టి సరోగసి ఐడియా నేనే ఇచ్చి బిడ్డకి  నేనే సరోగసి మథర్ అయి సక్సెస్ ఫుల్ గా బిడ్డని నా కడుపులో పెట్టుకుని ఇలా నీ ముందు నిలబడ్డాను అనగానే కృష్ణ ముకుంద అని గట్టిగా అరుస్తుంది.


కృష్ణ: ఎంతకు తెగించావే నువ్వు అసలు మనిషివేనా?


ముకుంద: మురారి కోసం ఎంతకైనా తెగిస్తాను. నేనే ముకుంద అని తెలిసిపోయింది కాబట్టి ఈ విషయం ఎవరితో అయినా చెప్పి నన్ను ఏదో చేయాలని చూస్తే.. నీకు బిడ్డలు పుట్టరని గొడ్రాలిగా ఉంటావని  అత్తయ్యకు నిజం చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించి మురారిని నా వాడిని చేసుకుంటాను.


కృష్ణ: స్టాపిడ్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ నీకు ఏం కావాలి.


ముకుంద: మురారి కావాలి నువ్వు ఇచ్చే వరకు నేను తీసుకునే వరకు ఇలాగే జరుగుతుంది. నీ బిడ్డ సాక్షిగా చెప్తున్నా ఇది నిజం.


అని చెప్పి ముకుంద వెళ్లిపోతుంది. కృష్ణ ఒక్కసారిగా కూలబడిపోతుంది. మరోవైపు మురారి టెన్షన్ గా ఇంటి దగ్గర కృష్ణ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఏమైందని మురారి అడిగితే.. ఆట పట్టించడానికని అలా చెప్పిందని కృష్ణ అబద్ధం చెప్తుంది. మురారి దగ్గర నిజం దాస్తుంది. తర్వాత కృష్ణ బాధగా భవానీ దగ్గరకు వస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావని భవానీ అంటుంది. అదేమీ లేదని చెప్తుంది. చిన్నాన్న దగ్గరకు వెళ్ళి వస్తానని అడుగుతుంది. హ్యాపీగా వెళ్ళి రమ్మని చెప్తుంది భవాని. ఇంతలో కృష్ణ భవానీ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. మరోవైపు ప్రభాకర్ భార్య పీడకల వచ్చిందని భయపడుతుంది. కిట్టయ్యకి ఏదో కీడు జరుగుతున్నట్టు కల వచ్చిందని చెప్తుది. దీంతో మనం అంతా ఉండగా కిట్టయ్యకి ఏం కాదని ప్రభాకర్ తిడతాడు. అప్పుడే కృష్ణ ఇంటికి వస్తుంది. కృష్ణను చూసి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.


ALSO READ: లక్ష్మీ మంచు సినిమా సెన్సార్ పూర్తి - పీరియాడిక్ డ్రామా రిలీజ్ ఎప్పుడంటే?