Guppedanta Manasu Serial Today Episode: మను వాళ్లు మోసం చేశారని శైలేంద్ర మనసులో కుమిలిపోతుంటే… దేవయాని వచ్చి ఏం జరిగిందని నిజం చెప్పమని గద్దించడంతో శైలేంద్ర తటపటాయిస్తాడు. నిజం చెప్తే మమ్మీ నన్ను తిడుతుందని మనసులో అనుకుని ఏం జరగలేదని చెప్తాడు. దీంతో దేవయాని శైలేంద్ర చెంప పగులగొడుతుంది. ఇప్పుడైనా నిజం చెప్పమని అడగడంతో శైలేంద్ర జరిగిన విషయం మొత్తం చెప్తాడు. రాజీవ్‌ను నేనే బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించేలా చేశారని బాధపడతాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది.
దేవయాని: అరేయ్ చెత్తనా సన్ను నా కడుపున చెడ పుట్టావు కదరా? అసలు వాళ్ల చేతిలో ఎలా మోస పోయావురా? వాళ్లు ఉన్న కండీషన్‌కు వాళ్లను నువ్వు దెబ్బ కొట్టాలి. కానీ వాళ్ల చేతిలో నువ్వు దెబ్బతినడమేంటిరా సిగ్గు లేకపోతే..
శైలేంద్ర: నువ్వు కద అమ్మా వాళ్లు మనలాగా తప్పు చేసేవాళ్లు కాదు అన్నావు. వాళ్లంతా మామూలు ముదుర్లు కాదు కంత్రీలు..
దేవయాని: వాళ్లు ముదుర్లు కాదురా.. నువ్వు చేతకాని వాడివి.. ఇంత జరుగుతుంటే కనీసం నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు.
శైలేంద్ర: అంటే మొత్తం సక్సెస్ అయ్యాక నీకు సర్‌ఫ్రైజ్ ఇద్దామనుకున్నాను మామ్.
అని శైలేంద్ర చెప్పగానే సర్‌ప్రైజ్ కాదు పెద్ద షాక్ ఇచ్చావు అంటుంది. ఇంతలో ధరణి వస్తుంది. ఏమైందని అడుగుతుంది. ఏం లేదని నువ్వు ఇక్కడి నుంచి వెళ్లమని అంటాడు శైలేంద్ర. ధరణి వెల్లిపోతుంది. రాజీవ్‌కు నువ్వు పట్టించావని తెలుసా అని దేవయాని అడుగుతే తెలియదని శైలేంద్ర చెప్తాడు. నువ్వు పట్టించినట్లు వాడికి తెలియకపోతే ప్రాబ్లం లేదు. లేదంటే వాడు నిన్ను అసలు వదిలిపెట్టడు. నువ్వు జైలుకు వెళ్లి వాణ్ని కలిసి వాడి మనసులో ఏముందో తెలుసుకో అని చెప్తుంది దేవయాని. మరోవైపు అనుపమ ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో వసుధార వస్తుంది.
వసుధార: మేడం ఆరోజు మను గారు దత్తత కార్యక్రమానికి రావడానికి ఒప్పుకోవడం ఒకటి మీరు ఒప్పుకోవడం.. రెండు తన తండ్రి గురించి తెలుస్తుంది అని. కానీ ఇంతలోనే పోలీసులు రావడం ఇదంతా జరగడం అయిపోయాయి. చూశారుగా కేసు నుంచి బయటపడి ఇంటికి వచ్చి రాగానే తన తండ్రి గురించి అడుగుతున్నాడు.
అనుపమ: అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు వసుధార.
వసు: తన తండ్రి గురించి తెలిస్తే ఎక్కడ మామయ్యను ఏం చేస్తారోనని మీరు భయపడుతున్నారు. మను గారు తనంతట తానే తెలుసుకుంటే అలాంటి పరిస్తితి వస్తుంది. లేదంటే మీరు నిజం చెబితే అలాంటి పరిస్థితి రాదు.
అను: అలా ఎందుకు అనుకుంటావు వసుధార. నేను నిజం చెప్పినంత మాత్రాన తన మనసులో ఇప్పుడు తండ్రి మీద ఉన్న ధ్వేషం తొలిగిపోతుందా ఏంటి?
వసు: కచ్చితంగా తొలగిపోతుంది మేడం. కాకపోతే మీరు చెప్పే రీతిలో చెప్పాలి. చెప్పే పద్దతిలో చెప్పాలి.
అంటూ వసుధార, అనుపమను కన్వీన్స్ చేస్తుంది. అయితే అనుపమ నేను చెప్పలేను అంటుంది. నిజం దాచిపెట్టడం వల్ల ఎవరికీ ఎటువంటి లాభం లేదని వసుధార చెప్తుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఏ నిజం అని అడుగుతాడు. దీంతో వసు, అను షాక్ అవుతారు. తర్వాత తేరుకుని ఏం లేదని మను గారికి తన తండ్రి గురించి చెప్పొచ్చు కదా అంటున్నాను. అనడంతో మహేంద్ర కూడా మను తండ్రిని తిడతాడు. మనుకు తన తండ్రి గురించి తెలిసిన వెంటనే మను కోపం వాడిని భస్మం చేస్తుంది అనడంతో వసు అలా అనకండి మామయ్యా అని చెప్తుంది. మీరు అలాంటోడి గురించి టెన్షన్ పడకండని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు. మనం ఈ విషయంలో మామయ్యగారికి దొరికిపోక ముందే మీరు నిజం చెప్పాలి అని వసు చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: రెడ్ లెహంగాలో కృతి శెట్టి ఘాటు అందాలు - మతిపోగోడుతున్న బేబమ్మ