ప్రస్తుతం ప్రభుత్వం పాత వాహనాలకు సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (HSRP) నంబర్ ప్లేట్ బిగించేందుకు గడువు విధించారన్న ప్రచారంపై తెలంగాణ రవాణాశాఖ స్పందించింది. “సెప్టెంబర్ 30 లోగా HSRP నంబర్ ప్లేట్ తప్పనిసరిగా బిగించకపోతే ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తారు” అనే వార్తల్లో వాస్తవం లేదు అని తెలంగాణ రవాణాశాఖ స్పష్టం చేసింది.

Continues below advertisement

రాష్ట్ర ప్రభుత్వం నుండి గడువు సంబంధిత అధికారిక ఉత్తర్వులు ఇంకా రవాణా శాఖకు అందలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కాబట్టి వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ఊరట కలిగించే విషయం చెప్పింది.

ఆ వెబ్‌సైట్స్, లింక్స్ క్లిక్ చేయవద్దు..

Continues below advertisement

అదేవిధంగా, HSRP నంబర్ ప్లేట్ బిగిస్తామని కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మరాదని రవాణాశాఖ సూచించింది. అలాగే ఆర్టీఏ చలాన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని తెలంగాణ రవాణా శాఖ సూచించింది. లేకపోతే ఆ లింకుల ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో సొమ్ము ఖాళీ చేస్తారని వాహనదారులను అప్రమత్తం చేసింది.

నెంబర్ ప్లేట్లపై జరుగుతున్న ప్రచారం ఇదే..హైదరాబాద్‌: మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైనది అయితే.. ఆ వాహనానికి త్వరగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) అమర్చుకోవాలి.  ఇకపై, ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు ఎటువంటి వాహనమైనా ఈ నంబర్ ప్లేట్‌ను తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఈ మేరకు రవాణాశాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించి, సంబంధిత మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని ప్రచారం జరిగింది.

వాహన రకాన్ని బట్టి HSRP ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320, గరిష్టంగా రూ.800 ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ నిబంధనలు నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, దొంగతనాలను అడ్డుకోవడం, వాహనాల రహదారి భద్రతను మెరుగుపరచడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఏప్రిల్ నెల నుంచి ప్రచారం జరుగుతోంది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ ఉంది, కానీ ఇప్పుడు పాత వాహనాలకూ ఈ నిబంధన అమలుచేయాలని నిర్ణయించారు.

కేసులు నమోదు చేస్తారని ప్రచారంపాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్‌ను అమర్చుకోవడం వాహన యజమానిది బాధ్యత అని రవాణాశాఖ స్పష్టం చేసిందని.. . హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) లేకుండా వాహనాలను అమ్మడం లేదా కొనడం సాధ్యం కాదు. అలాగే, వాహన యజమాని పేరు మార్చుకోవడం, వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి ఇతర పత్రాలను పొందడం కూడా సాధ్యం కాదు అని సెప్టెంబర్ 30 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేయాలని రవాణాశాఖ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఇంటి వద్దే నంబర్ ప్లేట్‌ అమర్చుకుంటే అదనంగా రుసుం చెల్లించాలని వైరల్ అయింది. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.inలో వివరాలు నమోదు చేయాలని, కొత్త ప్లేట్ బిగించుకున్నాక ఫొటో అప్ లోడ్ చేయాలని సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాల్లోనూ వచ్చింది. అయితే సెప్టెంబర్ 30 దగ్గర పడటంతో రవాణాశాఖ స్పందించింది. ఇప్పటివరకూ ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదని, డెడ్ లైన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.