Kotha Lokah Sequel Announcement With Special Video Promo: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హీరో ఫాంటసీ థ్రిల్లర్ 'కొత్త లోక చాప్టర్ 1'. చిన్న సినిమాగా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ సీక్వెల్‌పై తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఫస్ట్ పార్ట్‌ను మించి
ఈ మూవీని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మించారు. ఫస్ట్ పార్ట్‌లోనే దుల్కర్, టొవినో థామస్, షాబిన్ అతిథి పాత్రలో మెరిశారు. రెండో పార్ట్‌ను ఓ స్పెషల్ ప్రోమో వీడియోతో అనౌన్స్ చేశారు దుల్కర్. సీక్వెల్‌లో వీరిద్దరి పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ప్రోమోలో మైఖేల్ Vs చార్లీగా ఇద్దరి మధ్య సంభాషణను చూపించారు.
'పురాణాలకు అతీతంగా ఇతిహాసాలకు అతీతంగా కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది.' అంటూ దుల్కర్ రాసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్‌లో సూపర్ యోధురాలు, వారియర్ పాత్రలో కల్యాణి ప్రియదర్శన్ తన నటనతో మెప్పించారు. ఇక సెకండ్ పార్ట్‌లో ఆమె కొనసాగుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో ఫైనల్‌లో సూపర్ యోధుడు వచ్చేస్తున్నాడు అంటూ హైప్ క్రియేట్ చేశారు.
త్వరలో షూటింగ్
'కొత్త లోక' సీక్వెల్ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా... నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఫస్ట్ పార్ట్‌కు దర్శకత్వం వహించిన డొమినిక్ అరుణ్ సీక్వెల్ కూడా దర్శకత్వం వహించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
Also Read: 'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఫస్ట్ పార్ట్‌లో కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు ప్రేమలు ఫేం నస్లెన్ కీలక పాత్ర పోషించారు. దుల్కర్, టొవినో అతిథి పాత్రల్లో మెరిశారు. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ రిలీజ్ చేశారు. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ వస్తే జరిగే పరిణామాలు. అసలు ఆమెకు ఈ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, ఆ పవర్స్ వల్ల కలిగిన ఇబ్బందులను మూవీలో చాలా ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో సీక్వెల్‌పై హైప్ పదింతలు అయ్యింది.