Mohan Babu As Villain Role In Nani The Paradise Movie: నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ది ప్యారడైజ్' అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్‌తో పాటు అందరిలోనూ ఒకటే ప్రశ్న. నానికి తగిన విలన్ రోల్ ఎవరు చేస్తారనేదే ఆసక్తిని పెంచేసింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ రోల్ చేస్తారని అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం సాగింది.

Continues below advertisement

అయితే, గత కొద్ది రోజుల క్రితం 'దక్ష' ఈవెంట్‌లో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సైతం దీనిపై పొరపాటున లీక్స్ ఇచ్చారు. ఆయన 'ది ప్యారడైజ్'లో కీ రోల్ చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆయన సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నారనే అన్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా దీన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశారు.

ఫస్ట్ లుక్... వేరే లెవల్

Continues below advertisement

'ది ప్యారడైజ్' మోహన్ బాబు విలన్ రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు శ్రీకాంత్. చొక్కా లేకుండా కత్తిపై ఓ చేతిని ఉంచి మరో చేతిలో సిగార్, వెనుక గన్‌తో పవర్ ఫుల్‌‌గా ఉన్న మోహన్ బాబు లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'అతను వచ్చాడు. చూశాడు. జయించాడు, వెళ్లిపోయాడు. ఇప్పుడు లెజెండ్ ది మోహన్ బాబు 'ది ప్యారడైజ్'లో మరోసారి విలన్‌గా లేచారు. అతడు రాక్షసుడు. నామ్ హై 'శికంజా మాలిక్' @ మోహన్ బాబు సార్.' అంటూ రాసుకొచ్చారు. దీంతో హైప్ పదింతలు అవుతుంది.

మూవీలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జడలతో డిఫరెంట్ లుక్‌లో నాని అదరగొట్టగా... అంతే ఈక్వెల్‌గా విలన్ రోల్‌లో మోహన్ బాబు లుక్ సైతం వేరే లెవల్‌లో ఉంది. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సైతం ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: ఓటీటీలోకి యూత్ ఫుల్ 'లిటిల్ హార్ట్స్' - థియేటర్‌లో మిస్ అయిన సీన్స్‌తో కలిపి చూసెయ్యండి... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'ది ప్యారడైజ్' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. 'జడల్'గా నాని కనిపించనుండగా... 'శికంజి మాలిక్' నెగిటివ్ రోల్‌లో మోహన్ బాబు కనిపించనున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌ను శ్రీకాంత్ ఓదెల సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నారు. మూవీని ఎస్ఎల్‌‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.