Police Investigation On Lasya Nanditha Car Accident: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Mla Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. కాగా, ఆమె ప్రమాదానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే కారు రెయిలింగ్ తో పాటు ముందున్న లారీని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. అతి వేగంతో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు. కారు బానెట్ పై భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. ఎడమ వైపున ఉన్న ముందు చక్రం ధ్వంసంమైంది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రైక్ అయినట్లు గుర్తించారు. నందిత కారు బానెట్ పై భాగంలో అంటుకుని ఉన్న ఇసుకను క్లూస్ టీం సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రెయిలింగ్ ను మాత్రమే ఢీకొంటే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: Lasya Nanditha Died: ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం