Telangana News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కొంపల్లి సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడగా జనం భయంతో పరుగులు తీశారు. ప్రధాన రోడ్డు పక్కనే ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భాగ్యనగర గ్యాస్ సరఫరా పైప్ లీక్ అయినట్లు తెలుస్తోంది. రహదారి పక్కనే అభివృద్ధి పనులు చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 


విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ మళ్లించారు. సంబంధిత ఏజెన్సీ సిబ్బందికి సమాచారం అందించగా, వారు గ్యాస్ సరఫరా ఆపేశారు. అనంతరం పైప్ లైన్ కు సిబ్బంది మరమ్మతులు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.


Also Read: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం - సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండ్‌