Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించనున్న టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్టులోని పోస్టుల్లో మహిళకు పెద్ద ఎత్తున కొలువులు దక్కబోతున్నాయి. స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు జిల్లాల వారీగా రోస్టర్ పపాయింట్లను రూపొందించడంతో.. అందులోనూ మహిళ రోస్టర్ మేరకే పోస్టులు ఉండడంతో.. 51 శాతానికి పైగా ఉద్యోగాలు వారికే కేటాయించారు.


జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం మొదటి పోస్టు ఓసీ మహిళకు, రెండో పోస్టు ఎస్పీ మహిళకు వెళ్తుంది. అక్కడ రెండు పోస్టులు మాత్రమే ఉంటే.. ఆ రెండూ స్త్రీలకే వెళ్తాయి. తదుపరి రిక్రూట్ మెంట్ లో మరో రెండు పోస్టులు భర్తీ చేయాలనుకుంటే రోస్టర్ నుంచి మళ్లీ లెక్క మొదలవుతుంది. ప్రస్తుతం రాషఅట్రంలో 5 వేల 89 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20వ తేదీ నుంచి టీఆర్‌టీ నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచిదరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈక్రమంలోనే మంగళ వారం జిల్లాల వారీగా... సామాజిక వర్గాలు, పురుషులు, మహిళల వారీగా పోస్టులను ఖరారు చేసి వాటిని పాఠశాల విద్యాశాఖ తమ వెబ్ సైట్ లో ఉంచింది.


ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాల్లో మహిళలకు ఎక్కువ పోస్టులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 2 వేల 598 మంది మహిళలకు, 2 వేల 491 మంది పురుషులకు దక్కబోతున్నాయి. జనరల్‌ విభాగంలోనూ పురుషులతో మహిళలు పోటీ పడతారు. ఫలితంగా 55 నుంచి 60 శాతం ఉద్యోగాలను వారు సొంతం చేసుకోనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 275 ఖాళీల్లో.. 135, నల్గొండ జిల్లాలో 219లో 104, అలాగే భువనగిరిలో 99కిగాను 55, కరీంనగర్‌ జిల్లాలో 99లో 44, జనగామ జిల్లాలో 76కుగాను 42, హనుమకొండ జిల్లాలో 54లో 35, పెద్దపల్లి జిల్లాలోలో 43లో 32 ఉద్యోగాలు మహిళలకే దక్కబోతున్నాయి. ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వర్టికల్‌ పద్ధతిలోనే రోస్టర్‌ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఎంపిక నాటికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వర్టికలా, హారిజాంటల్‌ విధానమా అన్నది తెలుస్తుందని చెబుతున్నారు. 


ఈనెల 20వ తేదీ అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ వెళ్లి తెలుసుకోవాలని వివరించింది. మొత్తం 2 వేల 575 మంది ఎస్జీటీ పోస్టుల్లో దాదాపు 2 వేల వరకు తెలుగు మాధ్యమానికి సంబంధించివే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 40 ఎస్జీటీ ఆంగ్ల మాధ్యమం పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లలో బయాలజీ, సాంఘిక శాస్త్రం, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 36 కేటగిరీలు, జనగామలో 9 కేటగిరీల్లో కొలువులు ఉన్నాయి. ఎస్జీటీ తెలుగు, ఆంగ్లం, కన్నడం, తమిళం, ఉర్దూ, స్కూల్‌ అసిస్టెంట్లలో మాధ్యమాలు, సబ్జెక్టులు ఇలా ఉన్నాయి. ఉర్దూతో పాటు కన్నడం, తమిళం, మరాఠీ తదితర వాటిల్లో  అధిక శాతం పోస్టులు భర్తీ కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి మొత్తం 5 వేల 89 ఖాళీల్లో సుమారు 450 వరకు 2017 టీఆర్‌టీలో భర్తీ కానివే. అయితే ఈ పోస్టులనే క్యారీ ఫార్వర్డ్‌ చేశారు. ఈసారీ కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే తొలి సారిగా ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తుండగా...అందులో పురుషులకు, మహిళలకు ఎన్నెన్ని కేటాయిస్తారో ఖరారు చేశారు.


మొత్తం తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల్లోల ఎస్జీటీ పోస్టు 2 వేల 575 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్లు వెయ్యి 739 ఉన్నాయి. 1739 స్కూల్ అసిస్టెంట్లు ఉండగా.. 611 భాషా పండితుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 164 పీఈటీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు) ఖాళీ పోస్టులు ఉన్నాయి.