తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ సిద్ధం చేశారని విచారణ సందర్భంగా హైకోర్టు... తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్లను ప్రశ్నించిది. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 


ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించామని... చెప్పడంతో..  కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ , హోం శాఖ సెక్రెటరీలకు ఆర్డర్స్ పాస్ చేసింది. 


నిజానికి ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడే టిక్కెట్ రేట్లపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనంలో విచారణ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లలో టికెట్‌ ధరలను నిర్ణయించేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శుల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు అప్పట్లోనే  ఆదేశించింది. 2017 మార్చి 31 లోపు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీలకు అప్పుడే  సూచించింది. కమిటీలు నిర్ణయం తీసుకునేంత వరకు నిర్వహణ వ్యయాల ఆధారంగా టికెట్‌ ధరల ను నిర్ణయించుకోవచ్చునని థియేటర్లకు తెలిపింది. 


ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్‌ ధరలను సవరిస్తూ 2013 ఏప్రిల్‌ 26న జీవో 100ను జారీ చేశారు. ఈ జీవోతో తమకు ఆదాయం తగ్గిపోతుందని సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాల్లోని పలు థియేటర్ల యాజమాన్యలు 2014లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై తుది విచారణ చేపట్టిన హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేశారు. థియేటర్ల నిర్వహణ వ్యయాల్లోనూ భారీ మార్పులు వచ్చిన క్రమంలో పాత జీవో అమలులో ఉండటం సరికాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా టికెట్ల ధరలు కూడా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తరువాత తాజాగా మరికొన్ని థియేటర్లు పిటిషన్లు వేశాయి. కరోనాకు ముందు ఓ సారి టిక్కెట్ రేట్ల పెంపునకు..  తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 


2016 డిసెంబర్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రెండు రాష్ట్రాలు కమిటీలు నియమించాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగడంతో ఈ కమిటీల అంశం తెరపైకి వచ్చింది. వీరి నివేదికను... నాలుగు వారాల్లో హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నో వ్యయాలు పెరిగినందుకు టిక్కెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు ఛాన్‌ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అది ఎంత అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 


Also Read: భీమ్లా నాయక్ మేకింగ్ వీడియో.. ఫ్యాన్స్ కి పండగే!