Srinivas Goud :  తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చింది.  తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ నుకొట్టి వేయాలంటూ ఆయన దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.   మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని  శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ దాఖలయింది. మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ కు కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్  పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తాజాగా  శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. రాఘవేంద్ర రాజు   వేసిన పిటిషన్ ను అనుమతించింది హైకోర్టు.       

  


అఫిడవిట్‌లో తప్పులు ఉన్న కారణంగా కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసిన  రోజే.. శ్రీనివాస్  గౌడ్ వ్యవహారంలోనూ హైకోర్టు  ఆయన అఫిడవిట్ వ్యవహారంలో విచారణకు అంగీకరించడం కలకలంరేపుతోంది.  2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ ఆ సమయంలో నామినేషన్ తో పాటు, అఫిడవిట్ దాఖలు చేశారు.దానిని ఎన్నికల సంఘం వెబ్ సైట్ లోనూ పొందుపరిచారు. తొలి దశలో జరిగిన ఎన్నికలు కావడంతో దాదాపు రెండు నెలల తర్వాత కౌంటింగ్ నిర్వహించారు.కాకపోతే కౌంటింగ్ కు రెండు రోజులు ముందు వెబ్ సైట్ లో శ్రీనివాస్ గౌడ్ కు చెందిన కొత్త ఆఫిడవిట్ కనిపించింది. పాత అఫిడవిట్ ను తొలగించి, కొత్తది వెబ్ సైట్ లో పొందుపరచడం తో వివాదం మొదలైంది.


ఒకసారి నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత అఫిడవిట్ ను తొలగించడం సాధ్యం అయ్యేపని కాదు. దీనికి ఎన్నికల సంఘం అధికారులు తగిన విధంగా సహకరిస్తే తప్ప ఈ వ్యవహారంపై కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘానికి రాఘవేందర్ రాజు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరుపుతోంది. ఈ మధ్యలో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లి రాఘవేంద్ర రాజును తెలంగాణ పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆరెస్ట్ చేశారు. వారిపై సంచలన ఆరోపణలు చేశారు. పదిహేను కోట్లసుపారీతో  మంత్రిని హత్య చేయాలనుకున్నారని తేల్చారు.                                                 


అయితే ఎలాంటి సాక్ష్యాలను చూపించలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంత్రి ఎన్నికపై పోరాడుతున్నందునే తనపై తప్పుడు కేసులు పెట్టారని రాఘవేందర్ రాజు ఆరోపిస్తున్నారు. మొత్తంగా..   మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ మార్పు వ్యవహారం.. సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.