OG Overseas Rights: ప్రస్తుతం 'ఓజీ' కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ 4వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 'ఓజీ' ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.18 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఇంతకు మునుపు పవన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కంటే ఇది దాదాపు రెట్టింపు అన్నమాట. కాగా ఈ విషయంపై మేకర్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు.


అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ లాంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యమైన పాత్రలలో ఆకట్టుకోనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య 'ఓజీ'ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'బ్రో' తర్వాత.. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ'నే (వర్కింగ్ టైటిల్). సుజీత్ గతంలో 'రన్ రాజా రన్', 'సాహూ' వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని కూడా. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి. మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా 'OG' అని ప్రచారం చేశారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ నటుడు అర్జున్ దాస్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అయితే 'ఓజీ'ని  డిసెంబర్ 2023 లేదా ఏప్రిల్ 2024లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇక పవన్ కళ్యాణ్.. లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన 'వినోదయ సీతమ్' అనే  తమిళ సినిమాకు రీమేక్‌‌గా బ్రో అనే ఓ తెలుగు సినిమాను చేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించగా.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందింది. 'బ్రో'లో తంబి రామయ్య అనే మరో  కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 27, 2023న వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.  


Read Also : Tillu Square: అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - ‘టికెటే కొనకుండా’ అంటూ వస్తున్న ‘టిల్లు స్క్వేర్’!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial