KCR Fires On Congress: అధికారంలో ఉంటే కత్తులు తిప్పి యుద్దాలు చేస్తామంటారా అని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల చంఢాలపు మాటలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నాయకత్వంలో పార్టీలో చేరేందుకు సినీ నిర్మాత శ్రీనివాసరెడ్డి, నటుడు రవితేజ తమ అనుచరులతో కలిసి వచ్చారు. వారికి కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తరవాత కేసీఆర్ మాట్లాడారు.
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు !
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలిచి తీరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 11 నెలలు మాత్రమే అయిందని ఇప్పటికే ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన దాని కన్నా 90 శాతం అమలు చేశామన్నారు. అది చేస్తామని, ఇది చేస్తామని తాము పెద్ద పెద్ద మాటలు చెప్పగలమని, కాని నేల విడిచి సాము చేయలేదని ప్రజలకు వాస్తవాలే చెప్పామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో చెప్పినవే చేశామని కేసీఆర్ నేతలతో అన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామన్న పిచ్చి మాటలు తమకు రావా అని కేసీఆర్ ప్రశ్నించారు.
కార్యకర్తలు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు !
అయితే అవాస్తవాలు ప్రజలు ఎన్నడూ తాము చెప్పలేదన్నారు. ఏ పథకం చెపట్టినా తాము సమావేశాలు ఏర్పాటు చేసుకుని బడ్జెట్ అంచనాలు చూసుకునే దాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. బలహీనులు, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిదన్నారు. ఎన్నికల్లో తాము ప్రజలకు హమీలు ఇచ్చింది పది శాతం అయినా.. ప్రజలు అడగకుండానే వారి అవసరాల మేరకు 90 శాతం పనులు తాము చేసినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం లాగా రాగానే కత్తులు తిప్పుతాం.. యుద్దాలు చేస్తామని, కూలగొడతామని చెప్పలేదన్నారు. ప్రజల కోసమే పని చేసిందన్నారు.
Also Read: KTR News: నిధులు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా! ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కేటీఆర్, హరీష్ రావు ఫైర్
ప్రస్తుత ప్రభుత్వాధినేతలు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారని చంఢాలంగా మాట్లాడటం తగదని కేసీఆర్ విమర్శించారు. తాను ఇలాంటి మాటలు మాట్లాడగలనని, కాని అధికారంలో ఉండే వారు మాట్లాడటం తగదని హితవుచెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే ఇలాంటి బాద్యతలు ప్రజలు అప్పగించాలని నేతలు గుర్తెరగాలన్నారు. ఒక వ్యక్తి కోసం, ఓట్ల కోసం ప్రభుత్వాలు పని చేయకూడదన్నారు. ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఏం పని చేయలేదన్నారు. గ్రామాల్లో రోడ్లు, అభివృద్ధికి కృషి చేశారని కితాబిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నమ్మకంగా పని చేయాలని వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని కేసీఆర్ చెప్పార. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం