TDP Leader Manjula Reddy: ఏపీలో  సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ముఖ్యంగా పల్నాడులో జరిగిన హింస దృశ్యాలు వైరల్ అయ్యాయి. అలాంటి హింసలో ఓ మహిళ సాహసం అందరి దృష్టిని ఆకర్షించించి. మాచర్ల నియోజకవర్గం రెంట చింతల గ్రామంలో ఓ పోలింగ్ బూత్‌లో మంజులారెడ్డి టీడీపీ తరపున ఏజెంట్‌గా ఉన్నారు. అయితే ఆ గ్రామంలో పోలింగ్ బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకోవాలనుకున్న వైసీపీ నేతలు బూత్‌ కు వెళ్తున్న మంజులపై దాడిచేశారు. గొడ్డలితో ఆమె తలపై వేటు వేశారు. భయానకంగా గాయమైనా ఆమె వెనక్కి తగ్గలేదు. అలాగే పోలింగ్ బూత్‌కు వెళ్లారు. 

  



Also Read: జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్


 


ఆమె తెగువ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రత్యేక బలగాలు వచ్చిన తరవాత వేరే టీడీపీ ఏజెంట్ ధైర్యంగా కూర్చుంటారని అనుకున్న తర్వాతనే ఆమె పోలింగ్ బూత్ నుంచి వెళ్లారు. అప్పట్లో ఆమె తెగువ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.   



ఆ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుర్తించింది. నామినేటెడ్  పోస్టుల్లో ఆమెకు ఓ చైర్మన్ పదవి ఇచ్చారు. ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమెకు ఇచ్చారు. ఆమెకు పదవి ఇవ్వడంపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 




అలాగే చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఏపీ టీడీపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షురాలిగా ఉన్న తేజస్వి పొడపాటికి కూడా చైర్మన్ పదవి ఇచ్చారు. కల్చరల్ కార్పొరేషన్ బాధ్యతలు ఆమె చూసుకుంటారు.   




వీరిద్దరికీ పదవులు ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తల్ని గౌరవించే పార్టీ అని .. ఆ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రెండో జాబితాలో 59  మందికి పదవులు ఇచ్చారు. వీరిలో టీడీపీ వాళ్లే యాభై మందికిపైగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి.. కేసుల పాలైన వారికి.. సీట్లు త్యాగం చేసిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పదవులు కేటాయించారు.  


Also Read: అసెంబ్లీకి వైఎస్ఆర్‌సీపీ దూరం - మీడియా ముందే ప్రసంగాలు - బాధ్యతల నుంచి పారిపోయినట్లే !?