Jagan decided not to attend the assembly:ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమవేశాలు పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. చర్చలు హోరాహోరీగా సాగితే ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీకి హాజరవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మైక్ ఇవ్వరు కాబట్టి తాము హాజరు అయ్యేది లేదని ఆయన చెబుతున్నారు. 


ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తించడం లేదన్న జగన్ ! 


అసెంబ్లీలో అధికార కూటమి కాకుండా వైసీపీ ఒక్కటే ఉందని అయినా  తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు స్పీకర్ నిరాకరిస్తున్నారని జగన్ అంటున్నారు. ఇలా గుర్తించనందున మైక్ ఇవ్వరని ఇక అసెంబ్లీకి వెళ్లి ఏం ప్రయోజనమని ఆయన వాదన. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాత్రం జగన్ అసెంబ్లీకి రావాలని పిలుపునిస్తున్నారు. అధికార కూటమి కాకుండా ఉండేది వైసీపీనే కాబట్టి మాట్లాడేందుకు సమయం వస్తుందని స్ఫష్టం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దానిపై సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని కోర్టుకు కూడా వెళ్లారని ఆయన  గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం రానే రానని స్పష్టం చేశారు.     


అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు


ప్రజాప్రతినిధుల మొదటి బాధ్యత చట్టసభలకు హాజరు కావడం !


ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా  ప్రజా ప్రతినిధుల మొదటి బాధ్యత చట్టసభలకు హాజరు కావడం. చట్టాల రూపకల్పనలో పాలు పంచుకోవడం. ప్రజాసమస్యలను లేవనత్తడం. బయట ఎంత  మాట్లాడినా ఆ మాటలకు విలువ రాదు. అసెంబ్లీలో మట్లాడితే వచ్చే విలువ వేరు. అది రికార్డులలో ఉంటుంది.  ఈ విషయం జగన్ మోహన్ కన్నా ఆ పార్టీలో సీనయర్ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలను వినరని అంటారు. అందుకే జగన్ హాజరు కాకపోయినా తన పార్టీ ఎమ్మెల్యేలను అయినా పంపే అవకాశం లేదు. వైసీపీ నుంచి ఎవరూ హాజరయ్యే అవకాశం లేదు. తమ బాధ్యతను నిర్వహిస్తామని పార్టీని ధిక్కరించి ఎవరైనా హాజరైతే హాజరవ్వొచ్చు. 


మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్


అవమానిస్తారని భయపడుతున్నారా ?


ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు  కాబట్టి రావట్లేదని జగన్ చెబుతున్నారు కానీ అది కేవలం సాంకేతిక పదం. సభలో ఆయన తప్ప ప్రతిపక్ష నేత ఇంకెవరు ఉన్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో టీడీపీ సభ్యులు, చంద్రబాబు విషయంలో వ్యవహరించిన తీరు విషయంలో టీడీపీ ప్రతీకారం తీర్చుకుటుందని అందుకే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజల్లోనూ ఇదే చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ విస్మరిస్తున్నారని ఇది వైసీపీకి మంచిది కాదని అంటున్నారు.