జూబ్లీహిల్స్ లో ఇళ్ల మధ్య ఉన్న పబ్బులు తొలగించాలనే పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాటి వల్ల శబ్ద కాలుష్యం, ప్రమాదాలు పెరుగుతున్నాయని కోర్టుకు వివరించారు పిటిషనర్. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం మార్గదర్శకాల మేరకు ఏం చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. యువతను దృష్టిలో ఉంచుకుని పబ్బులపై చర్యలు ఉండాలని తెలిపింది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సరిపోతాయా అని ప్రశ్నించింది. అయితే, సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు ఏజీ తెలపగా.. న్యూఇయర్ వేడుకల్లోపే చర్యలు తీసుకోవాలని తెలిపింది హైకోర్టు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో గురువారం తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాగి రోడ్లపై హంగామా చేస్తే అంతే..
మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని కమిషనర్ ఆనంద్ పేర్కొన్నారు. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. కొవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దని చెప్పారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దని.. కమిషనర్ స్పష్టం చేశారు.
రెండు డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని కమిషనర్ ఆనంద్ స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫ్లైఓవర్లు మూసివేసి ఉంటాయన్నారు. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని అన్నారు. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు.
Also Read: Jagtial: ఇదేం వింత దొంగతనం.. కారులో వచ్చి.. పూల కుండీలు ఎత్తుకెళ్లడమేంటి..
Also Read: Khammam Suda: అభివద్ధి చెందుతున్నా.. కదలని సుడా మాస్టర్ ‘ప్లాన్’.. మోక్షమోప్పుడో!