Telangana IAS Transfers: హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 26 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్, గద్వాల, నల్గొండ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ.. కొత్త కలెక్టర్లను నియమించింది సర్కార్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్ గా స్మితా సబర్వాల్ ను నియమించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా తప్పించిన భారతీ హోలికేరికి పురావస్తు శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.
ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా డి. దివ్య
ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్
పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతీ హోలికేరి
ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్
గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా
టీఎస్ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టెం లక్ష్మీ
టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీగా క్రిష్ణ ఆదిత్య
 ముఖ్యమంత్రి, సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
హైదరాబాద్ (స్థానిక సంస్థలు) అడిషనల్ కలెక్టర్ పి కదిరావన్
బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం 
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్ గా స్మితా సబర్వాల్ ను నియమించారు


నల్గొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరి చందన
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్
రంగారెడ్డి కలెక్టర్‌గా శశాంక
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి నియామకం
గద్వాల జిల్లా కలెక్టర్‌గా బీఎం సంతోష్