Berlin Web Series: ‘మనీ హెయిస్ట్’.. వెబ్‌సిరీస్‌లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ స్పానిష్ వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ ఈ సిరీస్ ను చాలా మంది ఇష్టపడుతారు. ‘మనీ హెయిస్ట్’ సిరీస్ లో వచ్చిన అన్ని సిరీస్‌లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ సిరీస్ నుంచి మరో సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ‘బెర్లిన్‘ పేరుతో అభిమానులను అలరిస్తోంది.
‘మనీ హెయిస్ట్’ కంటే ముందు బెర్లిన్ ఏం చేసేవాడు?
‘మనీ హెయిస్ట్’ సిరీస్ లలో బ్యాంకు దోపిడీ వెనుక రెండు మాస్టర్ మైండ్స్ ఉంటాయి. వారిలో ఒకరు ప్రొఫెసర్, మరొకరు అతడి సోదరుడు బెర్లిన్. వీరిలో బెర్లిన్ నటన, ఆ పాత్రను రూపొందించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. అయితే,‘మనీ హెయిస్ట్’ కంటే ముందు బెర్లిన్ ఏం చేసేవాడు? ఆయన చేసిన దొంగతనాలు, దోపిడీలు ఏంటి? అనే పాయింట్ తో ‘బెర్లిన్’ సిరీస్ ను తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.
తెలుగులోనూ అందుబాటులో ‘బెర్లిన్’ వెబ్ సిరీస్
బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. సమంత సిక్వోరోస్, ట్రిస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛెజ్ ఇతర పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ‘బెర్లిన్‘ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో బెర్లిన్ లవర్ బాయ్‌లా అదరగొట్టాడు. ముచ్చటగా మూడు లవ్ స్టోరీలు, ఒక దోపిడీ ఘటనతో ఉత్కంఠభరితంగా ఈ సీరిస్ ఉంది.
8 ఎపిసోడ్లతో ‘బెర్లిన్’ వెబ్ సిరీస్
‘బెర్లిన్‘ వెబ్ సిరీస్ సుమారు 7 గంటల వ్యవధితో ఉంటుంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ లో ముఖ్యంగా ఆక్షన్ హౌస్ లో ఉన్న విలువైన ఆభరణాలను ఎలా కొట్టేస్తారు? అనే విషయాన్ని చూపించారు. పారిస్ ఆక్షన్ హౌస్ లో 44 మిలియన్ యూరోల విలువైన ఆభరణాలు ఉంటాయి. వాటిని కొల్లగొట్టేందుకు బెర్లిన్(పెడ్రో అలోన్స్) ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ లో దామియన్, కైలా, కామెరూన్, రాయ్, బ్రూస్ సాయం తీసుకుంటాడు. వీరంతా ఆయా విషయాల్లో నిపుణులు. నగలను దోపిడీ చేయడంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశాడు? ఈ మిషన్ లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని బ్రేక్ చేసి ఎలా ముందుకు సాగుతాడు? ఈ ప్రయాణంలో నటి సమంత సిక్వోరోస్ తో ఎలా ప్రేమలో పడతాడు? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదరవుతాయి? అనేది ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు.
Read Also: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా? ముఖ్యమంత్రిపై సింగర్ చిన్మయి విమర్శలు