గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. గోదావరి రివర్  మెనేజ్ మెంట్ బోర్డు ఛైర్మన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు విభజన చట్టం ప్రకారమే సీడబ్ల్యూసీకి పంపాలని లేఖలో పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌, ముక్తేశ్వర లిఫ్ట్‌, తుపాకుల గూడెం, మోడికుంట వాగు, సీతారామ లిఫ్ట్‌ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 967.94 టీఎంసీలు కేటాయించినట్లు జీఆర్ఎంబీ రాసిన లేఖలో మురళీధర్ పేర్కొన్నారు. నిర్దేశిత టీఎంసీలకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేపట్టిన ప్రాజెక్టులపై పరిశీలన అధికారం బోర్డుకు లేదని లేఖలో చెప్పారు. ఆ అంశాలను పరిశీలన చేసేందుకు సీడబ్ల్యూసీలో డైరెక్టరేట్లు ఉన్నాయని చెప్పారు. 


రాయలసీమ లిఫ్ట్‌ డీపీఆర్‌ను కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీకి పంపించిందని ఈఎన్సీ మురళీధర్​ చెప్పారు. పూర్తైన, కొనసాగుతున్న ప్రాజెక్టు డీపీఆర్లకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత సీడబ్ల్యుసీదేనని చెప్పారు. డీపీఆర్‌లకు అనుమతి అధికారం బోర్డులకు లేదని స్పష్టం చేశారు. డీపీఆర్ల ఆమోదంపై రెండో అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. కాలయాపన చేయకుండా డీపీఆర్లు సీడబ్ల్యూసీకి పంపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో డిమాండ్​ చేసింది.










ఇటీవలే లేఖ...


ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్‌ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని ఇటీవలే ఈఎన్సీ మురళీధర్ జీఆర్ఎంబీకి లేఖ రాశారు. ట్రిబ్యునల్‌లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో చెప్పారు. 


అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్‌ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్‌ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు.














 





Also Read: YSR Achievement Awards: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్


Also Read: Punch Prabhakar : ఎవరీ పంచ్ ప్రభాకర్ ? న్యాయవ్యవస్థను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ?


Also Read: AP Buggana : చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసినట్లుగా ఒప్పుకున్న బుగ్గన ! ఇక కేంద్రం అప్పులు తీసుకోనివ్వకపోతే ఏం చేస్తారు ?


Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..