Telangana Dasara Holidays: తెలంగాణలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇక దసరా నవరాత్రి రానుంది. దసరా పండుగ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన ఉండనుంది. ఈ నేపథ్యంలో దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీ నుంచి సాధారణంగా పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
దసరాకు ముందు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన ఉండనుంది. ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు.