TDP revealed reports that beef fat and fish oil were mixed in the ghee used to make Tirupati Laddu : తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయట పెట్టింది. నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్ ల రిపోర్టులను టీడీపీ నేత ఆనం  వెంకట రమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం 19 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లుగా గుర్తించారు.   





దేశంలోనే ప్రసిద్ది చెందిన  NDDB CALF ల్యాబ్ లో టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించారు. ఈ  నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు తేల్చారు.  
 



తిరుమల లడ్డూలో ఇలా బీఫ్ కొవ్వును కలిపి అమ్మిన వైనంపై చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. ఆ వెంటనే ఈ అంశంపై పెను దుమారం రేగింది. టీటీడీ చైర్మన్ గా చేసిన వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేసారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ఈ మేరకు.. ఆధారాలు బయటపెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుత ఈవో శ్యామలరావు.. నెయ్యిని టెస్టు చేయించి.. వెంటనే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టించారు. 


నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ కర్ణాటక ప్రభుత్వ రంగంలోని నందిని డెయిరీకి చెందిన స్వచ్చమైన ఆవు నెయ్యినే టీటీడీ కొనుగోలు చేసేది. అయితే అతి తక్కువ ధర నిర్ణయించడంతో నంది డైరీ సరఫరా చేయలేమని చెప్పింది. టెండర్లలో కూడా పాల్గొనలేదు. అత్యంత క్వాలిటీ నెయ్యి కేజీ రూ. వెయ్యి వరకూ అవుతుదంని కానీ టీటీడీ రూ. 320కే సరఫరా చేయాలని టెండర్లు పిలించిందని.. కఅంత తక్కువకు క్వాలిటీ నెయ్యి ఎలా వస్తుందో కనీసం పరిశీలన చేయలేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. 



Also Read: పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?