Jany Master Case: ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని.. గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదారాబాద్ తీసుకొస్తున్నామని పోలీసులు ప్రకటించారు. రేపు కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రీ రిజిస్టర్ చేశామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఈ కేసు నమోదు చేశామని తెలిపారు. 2020లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. అప్పుడు ఆమె మైనర్ అని.. ముంబయిలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అన్నారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టామని చెప్పారు.
నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య
అత్యాచారం కేసులో జానీ మాస్టర్ తో పాటు అతని భార్య ఆయేషా (సుమలత) పేరును బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు, పోలీసులు కేసు విషయమై ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పటికే జానీ మాస్టర్ ను బెంగళూరు లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మతం మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ భార్య బలవంతం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఫేక్ కాల్స్ వస్తున్నాయని చెబుతూ.. నార్సింగి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ విషయాన్నే ఆమె మీడియాకు తెలిపారు.