ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నగరపాలక సంస్థల మేయర్లు, ఛైర్​పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్​పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. జులై నుంచి గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. 


గౌరవ వేతనాలు 30 శాతం పెంపు


ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైదరాబాద్‌ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు, కోఆప్షన్‌ సభ్యులకు రవాణా భత్యంతో పాటు గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు, ఉప మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6000 నుంచి రూ.7800కి పెంచింది. 50 వేల జనాభా దాటిన పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్లకు రూ.15,000 నుంచి రూ.19,500, ఉప ఛైర్‌పర్సన్లకు రూ.7500 నుంచి రూ.9750, కౌన్సిలర్లకు రూ.3500 నుంచి రూ.4550కి పెరగనున్నాయి. 


Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్


ఎన్నికల సంఘం అనుమతి కోరిన ప్రభుత్వం


50 వేల కంటే తక్కువ జనాభా గల పురపాలికల ఛైర్‌పర్సన్లకు రూ.12,000 నుంచి రూ.15600, ఉప ఛైర్‌పర్సన్లకు రూ.5000 నుంచి రూ.6500, కౌన్సిలర్లకు రూ.2500 నుంచి రూ.3250 చొప్పున జులై నుంచి వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరో ఉత్తర్వు జారీ చేసింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. గౌరవ వేతనాల పెంచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని  రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది.  


Also Read: ఈటెల రాజేంద‌ర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!


ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈనెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవ్వగా 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 14న ఓట్లను లెక్కింపు ఉంటుంది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 


Also Read: చంద్రబాబు కన్నీళ్లు.. ఆర్జీవీ ఇలా వాడేసుకున్నాడు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి