HYDRA Effect :  హైడ్రా కూల్చివేతలను మరింత జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం  హైడ్రాకు త్వరలో కొత్త చట్టం ,విధివిధానలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టేషన్ కు నేరుాగ  ప్రజలే వచ్చి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తారు.  అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఇప్పటికే కార్యాచరణ రెడీ చేశారు.  అనుమతులు ఇచ్చిన వారి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామంటుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. 


హైడ్రాకు రోజుకు వంద ఫిర్యాదులు                                         


హైజ్రాకు ఇప్పటికే రోజుకు వందకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అవినీతి అధికారులను గుర్తించారని రంగనాథ్ ప్రకటించారు.  హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ..  చట్టం వస్తే నేరుగా హైడ్రా పేరుతోనే నోటీసులు వస్తాయన్నారు.  ప్రస్తుతం ఆయా స్దానిక సంస్దలు నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన సంస్ధకు చట్టబద్దత ఉంటుంది. అసెంబ్లీలో చట్టం చేయం పూర్తయితే ఇక తిరుగు ఉందు.  నాలాలు,రోడ్లు ఆక్రమణల కూల్చివేతకు నోటీలు అవసరం లేదు. త్వరలొ చెరువు బఫర్ జోన్, ఎఫ్ టిఎల్ సామాన్యులు సైతం తెలుసుకునేలా యాప్ అందుబాటులోకి..ఫిర్యాదులు సైతం యాప్ ద్వారా చేయవచ్చు.                         


న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ


కొత్త విభాగాల ఏర్పాటు 


హైడ్రాలో పలు విభాగాలు ఏర్పాటు చేస్తామని రంగనాథ్ తెలిపారు. చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూములు పరిరక్షణ.. ఇలా వివిధ విభాాగాలు ఏర్పాటు చేస్తామని..  నేరుగా ప్రజలు హైడ్రా పోలీస్ స్టేషన్ లోనే ఆక్రమణలపై ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు.  నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆక్రమణలపై పోలీసులు విచారణ జరుపుతారు.అవినీతి అదికారులపై కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు.  జీహెచ్ ఎంసీ, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ , వాల్టాచట్టం,నీటిపారుద శాఖ చట్టాల ద్వారా జారీ చేసే నోటీసులు ,తొలగింపులు అన్నీ పూర్తిగా ఇక హైడ్రా పరిధిలోకి రానున్నాయి. 


బ్రాండ్ ఇమేజ్ కోసమే రేవంత్ హైడ్రాని వాడుతున్నారా? ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ తర్వాత ఈయనేనా?


రంగంలోకి 72 ప్ర త్యేక బృందాలు                  


ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యలో నగరంలో 72బ్ఱందాలు ఏర్పాటు చేశారు.  మరింత బలోపేతం చేసేందుకు పోలీస్ సిబ్బంది, సర్వే ,నీటిపారుదల శాఖ నుండి అధికారులను కేటాయిస్తున్నారు.హైడ్రా ద్వారా హైదరాబాద్ లో చెరువుల్ని కబ్జా నుంచి కాపాడటంతో పాటు పెద్ద ఎత్తన ప్రభుత్ భూముల్ని ఆక్రమణ దారుల చెర నుంచి విడిపించడానికి ఏర్పాట్లు చేయన్నారు.