Telangana Formation Day: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేధికగా విషెస్ చెబుతూ ఓ కవితను రాసుకొచ్చారు. "పోరాట యోధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా... దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ.. దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ నేల... కేవలం పదేళ్లలోనే... వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన.. తెలంగాణ తోబుట్టువులందరికీ.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. జై తెలంగాణ.. జై భారత్" అంటూ చెప్పుకొచ్చారు. 






మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్ అని పేర్కొన్నారు. అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్ అని వివరించారు.


9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది కూడా కేసీఆర్ అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నదంటూ ప్రశంసించారు. అందుకే ’తెలంగాణ మోడల్‌’ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతుందన్నారు. అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే, స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్బం ఇదింటూ ట్వీట్ చేశారు. 






ఎమ్మెల్సీ కవిత కూడా ట్విట్టర్ వేధికగా.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  






టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోనియమ్మ సంకల్పమే స్ఫూర్తిగా, అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల సాధనకై… తాను సైతం పునరంకితమవుతున్నట్లు వెల్లడించారు. 






రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు అతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.










కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ట్విట్టర్ వేధికగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.