Telangana Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ( Nominations ) పరిశీలన ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత 2,898 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం ఏకంగా 1900 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం అత్యధికంగా సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ ( Gajwel ) బరిలో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో ( Narayanpet ) ఏడుగురు ఎన్నికల రేసుకు సిద్ధమయ్యారు. మేడ్చల్ 67, కామారెడ్డి 58, ఎల్బీనగర్ 57, మునుగోడు 50, కొడంగల్ సెగ్మెంట్ నుండి 15 మంది క్యాండిడేట్లు ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్ల తిరస్కరణకుగురైనవాటిలో ఎక్కువగా నిబంధనలు పాటించనివి, డమ్మ అభ్యర్తులనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నామినేషన్లు ఆమోదిచిన వారందరూ పోటీలో ఉండరు.
టీడీపీ, లోకేష్‌తో ఏ పంచాయతీ లేదంటున్న కేటీఆర్ - సీమాంధ్ర మూలాలున్న ఓటర్ల అసంతృప్తిని గుర్తించారా ?
నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉండటంతో ఎన్నికల బరిలో మొత్తం ఎందరూ ఉంటారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. నామినేషన్ల విత్ డ్రాకు రేపు ఒక్క రోజే గడువు ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రెబల్స్‌ను బుజ్జగిస్తున్నాయి. నామినేషన్ విత్ డ్రా చేసుకుని పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సంప్రదింపులు చేస్తున్నాయి. చాలా మంది రెబల్స్ పార్టీ నుంచి అభ్యర్థి నుంచి ఏదైనా హామీ పొంది పోటీ నుంచి విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత మంది మాత్రం గట్టిగా పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ కరెంట్ ఊడగొడుతం: రేవంత్ రెడ్డి ఫైర్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని స్పష్టమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని స్పష్టమవుతోంది.
రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రచారాలు చేస్తున్నాయి. అగ్రనేతలు పర్యటనలు చేస్తున్నారు. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రచార గడువు ఉంది. అంటే.. ఇంకా ఖచ్చితంగా రెండు వారాల సమయం ఉంది. ఈ రెండు వారాల్లో తెలంగాణ మొత్తం విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓటర్లను పూర్తి స్తాయిలో ఆకట్టుకుని ఈ సారి అధికారం సాధించాలని కాంగ్రెస్.. మూడో సారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.