Telangana Elections 2023 Modi Speech :   ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా త్వరలో ఓ కమిటీ వేస్తామని ప్రకటన చేశారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్‌ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభకు హాజరైన ప్రధాని  మోదీ..ఈ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందున్నారు.  30ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్ం కోసం పోరాడుతున్నారన్నారు. ఇంత కాలం మాటలు చెప్పి .. అమలు చేయని రాజకీయ పార్టీల తరపున తాను క్షమాపణ చెబుతున్నాన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 


పండుగ సమయంలో మనకు కావాల్సిన వారిమధ్యలోకి ఉండటం నాకు సంతోషంగా ఉంది.. అందుకే నేను రెట్టింపు ఉత్సాహంగా ఉన్నాను.. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగకు నా శుభాకాంక్షలు అన్నారు. మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన.. అణగారిన వర్గాలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు మోదీ. సామాజిక న్యాయం కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు.  30 యేళ్లుగా మందకృష్ణ మాదిక ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు.. వన్ లైన్.. వన్ మిషన్ గా మందకృష్ణ పోరాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ మాదిగల బాధను అర్థం చేసుకోలేదన్నారు ప్రధాని. మాదిగలకు నేను తోడుగా ఉంటారు.. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తామని  ప్రధాని మోదీ. హామీ ఇచ్చారు. 


మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నాను. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందని మోదీ అన్నారు. సమావేశంలో  కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించిందన్నారు. పార్లమెంట్ లో కనీసం అంబేద్కర్ ఫోటో కూడా పెట్టనివ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ  భారత రత్న కూడా ఇవ్వలేదన్నారు. అలాగే ఇతర దళిత నేతల్ని కూడా కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. దళితుడన రామ్ నాథ్ కోవింద్ ను.. గిరిజన వర్గానికి చెందిన ముర్మునుకూడా రాష్ట్రపతిగా  ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. 


బీఆర్ఎస్ పైనా మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బలిదానాలు చేసిన వారిని మోసం చేశారని.. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పికేసీఆర్ మోసం చేశారన్నారు. దళిత బంధు వల్ల ఎవరికి మేలు జరిగిందో చెప్పాలన్నారు. దళిత బంధు బీఆర్ఎస్ బంధువుల బంధుగా మారిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.  అవకాశవాద  రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సభకు హాజరైన వారికి మోదీ పిలుపునిచ్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆప్ తో కలిసి ఢిల్లీలో బీఆర్ఎస్ లిక్కర్ స్కాం చేసిందన్నారు. అభివృద్ధిలో కలసి రారు కానీ.. స్కాముల్లో మాత్రం కలుస్తారని సెటైర్ వేారు.  పదేళ్లుగా ప్రభుత్వం మాదిగల్ని మోసం చేస్తూనే ఉందన్నారు. 



అంతకు ముందు  మాదిగల విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశం. సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగను వేదికపైనే ఆలింగనం చేసుకుని.. హత్తుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. మోదీ ఆలింగనంతో.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు కృష్ణమాదిగ. కన్నీటి పర్యంతం అయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. దీన్ని చూసిన ప్రధాని మోదీ.. తన సీటు పక్కనే మంద కృష్ణ మాదిగను కూర్చోబెట్టుకున్నారు. కుర్చీని దగ్గరకు తీసుకుని.. అతని భుజంపై చేయి వేశారు.. మంద కృష్ణ మాదిగను ఓదార్చారు. ఐదు నిమిషాలపాటు ఈ దృశ్యం సభలో ఆసక్తి రేపింది. ప్రధాని స్థాయి వ్యక్తి.. తనకు ఇచ్చిన గౌరవం, సభకు హాజరైన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో సభ హోరెత్తింది.