Telangana Elections 2023 :  జయప్రకాష్ నారాయణ వంచి ఐఏఎస్, వీవీ లక్ష్మినారాయణ వంటి ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి వచ్చి   ఏ మాత్రం సక్సెస్ కాలేక..   రాజకీయ లౌక్యం కూడా తెలుసుకోక చతికిలపడ్డారు. వీరిని చూసిన తర్వాత ఐపీఎస్‌క వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకివచ్చి  ప్రవీణ్ కుమార్ పైనా ఎక్కువ మంది ఆశలు పెట్టుకోలేదు. కానీ ప్రవీణ్ తాను భిన్నమైన సివిల్ సర్వీస్ అధికారినని నిరూపించారు. చాలా వేగంగా రాజకీయ నాయకుడి రూపంలోకి మారిపోయారు. తన బలాన్ని గుర్తించుకుని దానిపైనే దృష్టి పెట్టి ముందుకు సాగారు. ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందన్న సంగతి పక్కన పెడితే.. సిర్పూర్ గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఇతర చోట్ల బలంగా ఓటు బ్యాంక్ ను చేజిక్కించుకునే ప్రయత్నాల్ల ఉన్నారు. 


స్వేరోస్ ద్వారా దళిత యువతలో ప్రత్యేక ఫాలోయింగ్ 


ఆయన స్వేరోస్ ద్వారా దళితుల్ని దగ్గర చేసుకుంటున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో  సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63 లక్షల  మంది దళితులున్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 17  శాతం. వీరు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగలరు. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. దళిత వాదం అందుకుంటున్నారు. అయితే.. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి నుంచి ఇప్పటి వరకూ ఒక్క సరైన నాయకుడు పుట్టుకురాలేదు. ఇప్పుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని.. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆయన చాలా కాలం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. దానికి స్వేరోస్‌నే సాక్ష్యం. స్వేరోస్  తెర వెనకు ప్రచారంలో సిద్ధహస్తులు.  


జనరల్ సీటు సిర్పూరులో పోటీ - గెలుపు అంచనాలు


దళిత వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వడు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ   జనరల్ సీటు అయిన సిర్పూర్‌లో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 90 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఉన్నాయి.  అభ్యర్థుల విజయంలో ఈ ఓటర్లే కీలకపాత్ర పోషిస్తారు. కొంతకాలంగా అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రవీణ్ కుమార్.. ​దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నారు.   స్వేరోస్ నాయకులు ఇప్పటికే సిర్పూర్​లో దిగి, చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు.   ప్రవీణ్ కుమార్ రాజకీయ ఆశలతో వచ్చిన జేపీ, వీవీ లక్ష్మినారాయణ వంటి వారిలా కాకుండా ఓ పార్టీ రాష్ట్ర శాఖకు నాయకత్వం వహిస్తూ.. నిరంతరం పోరాడుతున్నారు. ఆ పోరాట పటిమ ద్వారా ఓ బలమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. దళిత వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పొందితే ఎవరు నష్టపోతారన్న సంగతి పక్కన పెడితే.. ప్రవీణ్ కుమార్ సిర్పూరులో గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగే అవకాశం ఉంది.


సిర్పూరులో విజయం కోసం గట్టి ప్రయత్నం 


 కొమురంభీం జిల్లా జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటి అంటే.. ఈ నియోజకవర్గం  1962 నుంచి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థిని రెండేసి సార్లు గెలిపించిన క్రెడిట్‌ను సొంతం చేసుకుంది.  1962 నుంచి 1978 వరకు వరుసగా జరిగిన ఎన్నికలలో నాలుగు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే.. 1983, 1985, 1999 లలో టీడీపీని విజయం వరించింది.  2004 ఎన్నికలలో  మాత్రం కాంగ్రెస్‌కు గెలిచింది. తెలంగాణలో మొదటి నంబరు శాసనసభ నియోజకవర్గ స్థానం ఈ నియోజకవర్గానికే లభించింది.