Car Care Tips in Winter Season: శీతాకాలంలో మీ కారుకు మంచి సంరక్షణ అవసరం. లేకుంటే వాతావరణం అనుకూలించక ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ వార్తలో చల్లని వాతావరణంలో కారు సంరక్షణ కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం.
కారు లైట్లను చెక్ చేయండి
చలికాలంలో పగలు సమయం తగ్గి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే పగటి వెలుతురు కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీ కారు లైట్లు (హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు, బ్యాక్ లైట్లు) సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేయడం ముఖ్యం. ఏదైనా లైట్ సరిగ్గా లేకపోతే వెంటనే దాన్ని మార్చండి.
కారు బ్యాటరీని మెయింటెయిన్ చేయండి
ఇది శీతాకాలంలో ఎక్కువగా తలెత్తే సమస్య. బలహీనమైన బ్యాటరీ కూడా వేడి వాతావరణంలో బాగా పని చేస్తుంది. కానీ శీతాకాలంలో డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు లాంగ్ డ్రైవ్‌లు ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాటరీని చెక్ చేయండి. అది సరిగ్గా పని చేయకపోతే దాన్ని మార్చండి. లేకపోతే దారిలో బ్యాటరీ కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
ఇంజిన్ ఆయిల్/కూలెంట్
మీరు చాలా కాలంగా ఇంజిన్ ఆయిల్ లేదా కూలెంట్‌ని మార్చకుంటే, దాన్ని తరచుగా మారుస్తూ ఉండండి. చలికాలంలో లైట్ ఇంజిన్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. దీని కోసం మీరు మీ కారుతో అందించిన యూజర్ మాన్యువల్, కంపెనీ రికమండేషన్స్‌ను ఉపయోగించవచ్చు.
విండ్‌షీల్డ్ వైపర్‌లను చెక్ చేయండి
చల్లని వాతావరణంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి విరిగిపోయినట్లు లేదా షేప్ అవుట్ అయినట్లు కనిపిస్తే వెంటనే వాటిని భర్తీ చేయండి.
విండ్ షీల్డ్ పగిలిందా?
ఇది కారులో ఒక ముఖ్యమైన భాగం. క్యాబిన్‌లోకి దుమ్ము, మట్టి, నీరు మొదలైనవాటిని చేరకుండా నిరోధిస్తుంది. అందుకని అందులో పగుళ్లు వగైరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. దీని కారణంగా నీటి చుక్కలు లోపలికి వస్తాయి. ఇది కాకుండా శీతాకాలంలో పొగమంచు, దుమ్ము పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కారు టైర్లు మంచి స్థితిలో ఉండాలి
శీతాకాలంలో కారు టైర్ల మంచి కండిషన్‌లో ఉండాలి. ఎందుకంటే రోడ్లు జారుడుగా ఉంటాయి. దీని కారణంగా సడన్‌గా బ్రేక్ వేస్తే జారిపోయే అవకాశం ఉంది. టైర్ చిరిగినా లేదా పాడైపోయినా వెంటనే దాన్ని మార్చండి.
ఇంజిన్ హీట్ అవ్వడం
శీతాకాలంలో కారు మెరుగైన పనితీరు కోసం ఇంజిన్‌ను వేడెక్కడం ముఖ్యం. దానికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. అందువల్ల ఎక్కడికైనా బయలుదేరే ముందు, కారుని స్టార్ట్ చేసి కొన్ని నిమిషాలు వదిలివేయండి. ఆ తర్వాత మాత్రమే ఎక్కడికైనా బయలుదేరండి.
బ్రేక్‌లను చెక్ చేయండి
చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్లు జారుడుగా మారుతాయి. దీని మీద కారు జారిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కారు బ్రేకులు మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. తద్వారా సడన్ బ్రేకింగ్ విషయంలో ప్రమాదాలను నివారించవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!