WhatsApp Web Screen Lock: స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారినట్లే, కొన్ని యాప్‌లు కూడా మన జీవితంలో భాగమయ్యాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌ను మనం రోజూ ఎన్నోసార్లు ఓపెన్ చేస్తాం. ఫాస్ట్ కమ్యూనికేషన్ కోసం కొన్ని ఆఫీసుల్లో కూడా వాట్సాప్ ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఆఫీసుల్లో వాట్సాప్ వెబ్‌ని ఉపయోగిస్తుంటే, మీరు ఆన్ చేయవలసిన ముఖ్యమైన సెట్టింగ్ ఒకటి ఉంది.


ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ అవసరం
చాలా సార్లు మనం ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి ఆఫీసులో ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్తూ ఉంటాం. ఒక్కోసారి మీటింగ్ వల్లనో, వ్యక్తిగత పనుల వల్లనో సీటు వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఎవరైనా మీరు కూర్చునే చోటుకు వస్తే, మీ చాట్‌లను ఎవరైనా చూడగలరు. ప్రైవేట్ చాట్‌లతో పాటు, కొన్నిసార్లు రహస్య విషయాలు కూడా ఇతర వ్యక్తులకు తెలిసిపోతాయి. దీన్ని నివారించడానికి, మీరు వాట్సాప్ వెబ్‌ను లాక్ చేయవచ్చు.


ఇలా లాక్ చేయండి
1. వాట్సాప్ వెబ్‌ను లాక్ చేయడానికి, ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లి, ఆపై ప్రైవసీ ఆప్షన్‌కు వెళ్లి, కింద కనిపించే ఉన్న స్క్రీన్ లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
2. ఇప్పుడు పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు తప్పనిసరిగా ఆరు అక్షరాల కంటే ఎక్కువ పాస్‌వర్డ్‌ని సెట్ చేయాలి.
3. పాస్‌వర్డ్‌ను సెట్ చేసిన తర్వత, మీరు లాక్ చేయడానికి టైమ్ లిమిట్‌ను కూడా ఎంచుకోవచ్చు.
4. ప్రస్తుతానికి ఒక్క నిమిషం, 15 నిమిషాలు, 30 నిమిషాల ఆప్షన్లు ఉన్నాయి.


ప్రతిసారీ స్క్రీన్ లాక్ ఆన్ చేయాలి
వాట్సాప్ వెబ్‌లో ఉన్న సమస్య ఏమిటంటే, మీరు స్క్రీన్ లాక్‌ని ఆన్ చేసిన తర్వాత ఖాతాను లాగ్ అవుట్ చేస్తే, తర్వాత ఓపెన్ చేసినప్పుడు మీరు దాన్ని మళ్లీ ఆన్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్‌వర్డ్‌ను మరచిపోతే, మీరు ఖాతాను లాగ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి.


మరోవైపు వాట్సాప్, గూగుల్ సంస్థలు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో వాట్సాప్ ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను మెటా, గూగుల్ ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం మీరు వాట్సాప్‌లో ఎంత అన్‌లిమిటెడ్ డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. త్వరలో కంపెనీ దీన్ని 15 జీబీకి మాత్రమే పరిమితం చేయబోతోంది. అంటే మీకు మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ  ఉంటే కేవలం అంత డేటాను మాత్రమే బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించేది కాదు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో అఫీషియల్‌గా అప్‌డేట్ చేసింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!