Election Counting Centers in Telangana: తెలంగాణలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
ABP Desam | 01 Dec 2023 12:05 PM (IST)
Telangana Elections: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. డిసెంబర్ 3న కౌంటింగ్ కోసం జిల్లా కేంద్రాల్లో విద్యా సంస్థలు కేటాయించారు.

ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి