Political Astrology Predictions 2023 : రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం.  ఇందుకు ప్రజాభిమానంతో పాటూ అదృష్టం కూడా కలసిరావాలి. ఆ అదృష్టాన్ని డిసైడ్ చేస్తాయి మీ జాతకంలో గ్రహాల సంచారం.  2023లో జరిగే ఎన్నికల్లో ఏ రాశుల రాజకీయ నాయకులకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందా...


ఏ రాశుల రాజకీయ నాయకులకు గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


సింహ రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ఉన్నప్పటికీ పదవుల్లో వెలిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి. విజేతలుగా నిలవలేరు. చివరి నిముషంలో సమీకరణాలు మారిపోతాయి..డబ్బులు ఖర్చు అయినా అందుకు తగిన ఫలితం దక్కడం కష్టమే


Also Read: ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!


కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


కన్యా రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది అంత అనుకూల ఫలితాలు లేవు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతారు. అధిష్టాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. ఎన్నికల్లో పోటీచేసినా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు..శత్రువర్గం ఆరోపణల వలయంలో చిక్కుకుంటారు


తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4 పాదాలు స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


తులారాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది కష్టకాలమే. గ్రహసంచారం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రజల్లో మీపై ఉన్న విశ్వాసం తగ్గుతుంది.  అధిష్టాన వర్గంలోనూ మీపేరు, గుర్తింపు తగ్గుతుంది. శత్రువులవలన ఇబ్బందులు ఉండొచ్చు. నమ్మినవారే దగాచేస్తారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది కానీ ఫలితం ఉండదు


Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023


కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుంభ రాశికి చెందిన రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం గడ్డుకాలమనే చెప్పాలి. ప్రజల్లో మీపై విశ్వాసం కోల్పోతారు. అధిష్ఠాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. మీపై వ్యతిరేకత పెరుగుతుంది.. నమ్మినవారే దగా చేస్తారు. మీతో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్త...


Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది


మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశికి చెందిన రాజకీయనాయకులకు అంత అనుకూలంగా లేదు. ప్రజలు, అధిష్టానం నుంచి మంచి పేరు పొందలేరు. ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవక తప్పదు. పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply