Astrology: వ్యక్తుల మనస్తత్వం, ప్రవర్తనా విధానం, ఆలోచనా విధానం ఇవన్నీ వారి గ్రహస్థితిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మీ జాతకంలో లగ్నం, గ్రహసంచారం ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులున్నప్పటికీ...మీ రాశి ఆధారంగా మీ మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఇందులో భాగంగా.. మాటలపోగుల్లా మాట్లాడుతూ ఏవిషయాన్ని మనసులో దాచుకోలేని రాశులెవరో చూద్దాం...


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఈ రాశివారికి మనసులో మాట దాగదు.  మహా తొందర. అందరితోనూ అన్ని విషయాలను పంచుకోవాలి అనుకుంటారు. మనసులో ఏముందో అదే విషయాన్ని చెప్పేస్తారు. అందుకే వీరి మాటలకు ఎదుటివారు తొందరగా హర్ట్ అవుతారు. అయితే ఈరాశివారికి ఒకే రకమైన అభిప్రాయాలు, భావాలు ఉండవు..ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. 


Also Read: ఈ రాశివారి మాట, మనసు రెండూ చంచలమే - నవంబరు 30 రాశిఫలాలు


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఈ రాశివారు అందరి మంచీ కోరుకుంటారు..అందర్నీ తమవారే అనేసుకుంటారు. అందుకే  తమ మనసులో  విషయాలను తొందరగా బయటపెట్టేస్తారు. మాటలతో ఆకట్టుకోవడంలో ఈ రాశివారు దిట్ట. వీరి మాటతీరుతో ఎవ్వరినైనా పడేస్తారు. తమ చుట్టూ ఉన్నవారిని మాటలతో ఉత్సాహపరుస్తూ ఉంటారు. 


సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదాలు)


సింహరాశివారు తొందరగా ఆకర్షిస్తారు. వీరి  వ్యక్తిత్వం, ప్రవర్తన అందరకీ నచ్చుతుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ. తమ మనసులో విషయాలు తొందరగా బయటపట్టేస్తారు కానీ ఆ తర్వాత మర్చిపోతారు.  వారు చెప్పింది విన్నవాళ్లు  మళ్లీ గుర్తుచేసిన తర్వాత అవునా అని ఆశ్చర్యంగా మొహం పెడతారు.


Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023


ధనస్సు రాశి (Sagitterius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదాలు)


ఈ రాశివారికి మాట్లాడటం అంటే మహా ఇష్టం. కుటుంబం, స్నేహితులు, తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు ఇలా అందరితోనూ మాట్లాడుతూనే ఉంటారు. వారు తమను తాము ఇతరులతో వ్యక్తీకరించినప్పుడు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు. ఏ విషయాన్ని మనసులో దాచుకోకుండా చెప్పేస్తారు. ఏ విషయంపై అయినా వీరికి లోతుగా అవగాహన ఉంటుంది.  


కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుంభరాశి వారు నిజాయితీ పరులు, చమత్కారులు. అందరకీ తొందరగా నచ్చేస్తారు.  వీరిలో కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి..అయితే వాటిని అమలు చేసేలోగా ముందే బయటపెట్టేస్తారు. వీరి మనసులో కూడా ఏ విషయం ఆగదు. అయితే ఈ రాశివారు చెప్పింది నిజమో అబద్ధమో అర్థంకాని స్థితిలో ఉంటారు వినేవారు. 


Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది


మనసులో ఏదీ దాచుకోకుండా బయటపెట్టడం మంచి అలవాటే కానీ కొన్ని సందర్భాల్లో ఇదే సమస్యలు కొనితెస్తుంది. మీరు ఎంత మంచివారు అన్నది కాదు మీరు చెబుతున్నది ఎవరితో, ఎలాంటి వారితో అన్నది గుర్తించాలి. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది.


గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply